రణస్థలి
రణస్థలి 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] సూరెడ్డి విష్ణుగారి సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనుపమ సూరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పరశురాం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ధర్మ, చాందిని రావు, ప్రశాంత్, శివ, అశోక్ సంగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబరు 26న విడుదలైంది.[2]
రణస్థలి | |
---|---|
![]() | |
దర్శకత్వం | పరశురాం శ్రీనివాస్ |
రచన | పరశురాం శ్రీనివాస్ |
నిర్మాత | అనుపమ సూరెడ్డి |
నటవర్గం | ధర్మ చాందిని రావు ప్రశాంత్ శివ |
ఛాయాగ్రహణం | కేశవ్ కిరణ్ |
కూర్పు | ఎం. భువనచంద్ర |
సంగీతం | కేశవ్ కిరణ్ |
నిర్మాణ సంస్థ | ఏ.జె ప్రొడక్షన్స్ |
విడుదల తేదీలు | 2022 నవంబర్ 26 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
బసవ (ధర్మ), అమ్ములు (చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములును బసవ తండ్రి మున్నియ్య (సమ్మెట గాంధీ) పెంచి పోషించి వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ చేసిన అప్పు తీర్చడం కోసం చక్రవర్తి (బెనర్జీ) తోటలో పనికి చేరుతాడు. తోటలో పనిచేయడం కోసం నలుగురు కూళీలు వస్తారు. అయితే తోటకి వచ్చింది పనివాళ్ళు కాదు కిరాయి గుండాలు అని బసవకి తెలిసేలోపే చక్రవర్తిని, అమ్ములును చంపేస్తారు. అసలు ఆ గుండాలు ఎందుకు వాళ్లని చంపారు ? వాళ్ళని ఎవరు పంపించారు ? అసలు చక్రవర్తి ఎవరు? తన భార్య మరణానికి కారణమయిన వారిని ఎలా మట్టుపెట్టాడన్నది అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులుసవరించు
- ధర్మ
- అమ్ము అభిరామి
- చాందిని రావు
- ప్రశాంత్
- శివ
- అశోక్ సంగా
- సమ్మెట గాంధీ
- బెనర్జీ
- మధుమణి
- దిల్ రమేష్ చంద్రశేఖర్
- ప్రశాంత్
- నాగేంద్ర
- వెట్టి
- తేజ
సాంకేతిక నిపుణులుసవరించు
- సమర్పణ: సూరెడ్డి విష్ణుగారి
- బ్యానర్: ఏ.జె ప్రొడక్షన్స్
- నిర్మాత: అనుపమ సూరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరశురాం శ్రీనివాస్
- సంగీతం: కేశవ్ కిరణ్
- సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ
- ఎడిటర్: భువనచంద్ర.ఎం
- సహా నిర్మాత: లక్ష్మీ జ్యోతి శ్రీనివాస్
- ఫైట్ మాష్టర్: డ్రాగన్ ప్రకాష్
- ఆర్ట్: సుజిత్ కార్తీక్
మూలాలుసవరించు
- ↑ EENADU (26 April 2022). "'రణస్థలి'లో గెలుపెవరిది?". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
- ↑ ETV Bharat News (21 November 2022). "ఈ వారమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'తోడేలు'.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
- ↑ Sakshi (26 November 2022). "'రణస్థలి' మూవీ రివ్యూ". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.