బెనర్జీ (నటుడు)
బెనర్జీ గా పేరుగాంచిన మాగంటి వేణు బెనర్జీ ఒక తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారాడు.[1]
బెనర్జీ | |
---|---|
జననం | మాగంటి వేణుబెనర్జీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1980 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఎం.శైలజ |
పిల్లలు | ఎం.రినిత USA |
తల్లిదండ్రులు |
|
వ్యక్తిగత వివరాలు
మార్చుబెనర్జీ విజయవాడ లోని గవర్నరుపేటలో జన్మించాడు. [2] తండ్రి రాఘవయ్య కూడా నటుడు. వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల తదితర చిత్రాల్లో నటించాడు. ఆయన ఆఖరి సినిమా భరత్ అనే నేను.[3]
బెనర్జీ బెజవాడలో కొండపల్లి కోటేశ్వరమ్మ స్థాపించిన మాంటిస్సోరి చిల్డ్రన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన తండ్రి సమాచార శాఖలో ఉద్యోగి కావడంతో ఆయనకు ఢిల్లీకి బదిలీ అయింది. బెనర్జీ కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. గుంటూరులోని ఏ.సి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. తరువాత మద్రాసులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, బి.ఏ చదివాడు. కానీ ఈ చదువు పూర్తి కాలేదు. అప్పటికే తండ్రి సినిమా పరిశ్రమలో ఉండటంతో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది.
విజయనగరంలో ఓ కంపెనీకి బ్రాంచి మేనేజరుగా పనిచేశాడు. ఆయనకు ఓ అక్క ఉంది. ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తుంది. ప్రస్తుతం ఆయన తన భార్య, కూతురుతో కలిసి జీవిస్తున్నాడు.
కెరీర్
మార్చుమొదటగా యు. విశ్వేశ్వరరావు దగ్గర హరిశ్చంద్రుడు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇందులో ప్రభాకర్ రెడ్డి, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోనే ఈయన ఒక చిన్నపాత్రలో కూడా నటించాడు. ఈ సినిమాకు జాతీయ పురస్కారం వచ్చింది. తర్వాత తాతినేని రామారావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సహాయ దర్శకుడిగా పని చేస్తూనే నటుడిగా మారాడు.[4]
తెలుగు సినీ కార్మికుల సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో కూడా ఈయన కొన్ని పదవులు చేపట్టాడు.
నటించిన సినిమాలు
మార్చు- గాయం (1993)
- సాంబయ్య (1999)
- పాపే నా ప్రాణం (2000)
- ఆయుధం
- ఆంధ్రావాలా[5]
- గౌరి (2004)
- ఎంత బావుందో!
- చిత్రం
- అల్లరి రాముడు (2002)
- హోలీ (2002)
- నువ్వు నేను
- నాగప్రతిష్ఠ (2003)
- సంబరం
- మల్లీశ్వరి
- బొంబాయి ప్రియుడు
- ఈ అబ్బాయి చాలా మంచోడు
- నాయకుడు (2005)
- మిస్టర్ పర్ఫెక్ట్
- అతడెవరు (2007)
- బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
- అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ (2013)[6]
- జై శ్రీరామ్ (2013)[7]
- జంప్ జిలాని (2014)
- జేమ్స్ బాండ్ (2015)
- ఇంటలిజెంట్ ఇడియట్స్ (2015)
- జనతా గ్యారేజ్
- పిడుగు (2016)
- శమంతకమణి (2017)
- వీడెవడు (2017)
- తిప్పరా మీసం (2019)
- కృష్ణ రావు సూపర్ మార్కెట్(2019)
- మేరాదోస్త్ *(2019)
- ఎంఎంఓఎఫ్ (2021)
- భగత్‌సింగ్ నగర్ (2021)
- అతడు ఆమె ప్రియుడు (2022)
- రణస్థలి (2022)
- కథ వెనుక కథ (2023)
- దోచేవారెవరురా (2023)
- ఐక్యూ (2023)
- లవ్ యూ రామ్ (2023)
మూలాలు
మార్చు- ↑ Y, Sunitha Chowdhary (22 April 2012). "Resigned to reality". The Hindu. Retrieved 6 June 2016.
- ↑ HM TV. "Interview with Banerji". youtube. Retrieved 6 June 2016.
- ↑ "నటుడు బెనర్జీకి పితృవియోగం". eenadu.net. ఈనాడు. 15 April 2018. Archived from the original on 15 April 2018. Retrieved 15 April 2018.
- ↑ "Artist Banerjee : చిరంజీవి బయోపిక్ తీస్తానని అనలేదు: నటుడు బెనర్జీ". EENADU. Retrieved 2022-06-08.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ Abbayi class Ammayi mass Movie Review {1.5/5}: Critic Review of Abbayi class Ammayi mass by Times of India, retrieved 15 May 2020
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.