రఫ్లెసియా (Rafflesia) అనగా పరాన్నమొక్కల్ల కుటుంబాల్లో ఒక కుటుంబం. ఇందులో సుమారు 28 జాతులున్నాయి. ఇవి మాలే పెనిన్సులా, బోర్నియో, సుమత్రా, థాయ్ లాండ్, ఫిలిప్పిన్స్ వంటి దేశాల్లో కనిపిస్తాయి. రఫ్లెసియా జాతి మొట్టమొదటి సారిగా ఇండొనేషియా అడవుల్లో కనుగొనబడింది. ఇండొనేషియా అడవిల్లో ఎక్స్ పెడిషన్ టీం కు సారధ్యం వహించిన సర్ థామస్ స్టాంఫర్డ్ రఫ్లెస్ వలన ఈ మొక్కకు పేరు వచ్చింది. అయితే అంతకుముందే జావా ద్వీపంలో 1791 నుండి 1794 మధ్య లూయిస్ డెస్ఛాప్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నా అతని నోట్సు, బొమ్మలు బ్రిటీషువారిచే 1803 లో సీజ్ చేయబడినవి.

Rafflesia
Rafflesia arnoldii flower and bud
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Rafflesia

టెట్రాస్టిగ్మా అనే జీనస్ లో ఎండొపేరసైట్ అయిన రఫ్లెసియా మొక్కలకు నిజమైన కాండాలు గాని, ఆకులుగాని, వ్రేళ్ళుగాని ఉండవు. కేవలం నేలపై రాలిపోయిన ఐదు రేఖల పుష్పాలవలె కనిపిస్తాయి. రఫ్లెసియా మొక్కల వీన్స్ ద్రాక్షతీగ జాతికి చెందిన మొక్కల టిష్యూలలో వ్యాప్తి చెందుతాయి. రఫ్లెసియ అర్నోల్డీ (Rafflesia arnoldii) వంటి రకం 39 అంగుళాల వ్యాసార్ధం కలిగివుండి 10 కేజీల బరువు తూగుతుంది. రఫ్లెసియాలో చిన్న రకాలు కూడా కనీసం 12 సెంటీమీటర్ల వ్యాసార్ధం కలిగివుంటాయి. రఫ్లెసియా మొక్కలు ఎప్పుడూ కుళ్ళిపోయిన చేప వాసన వెదజల్లుతూవుంటాయి. ఈ దుర్గందంచే ఆకర్షింపబడే ఈగలు మగ పుష్పాలనుండి ఆడ పుష్పాల కు పుప్పొడిని చేరవేసి సంపర్కం చేస్తాయి. కొన్నిరకాల రఫ్లెసియా పువ్వులు మాత్రం ఆడ, మగ పోలిన్స్ కలిగివుంటాయి. అందుకే వాటిని ఆంగ్లంలో 'కార్ఫ్స్ ప్లవర్' లేదా 'మీట్ ఫ్లవర్' అని అంటారు. అయితే ఈ పేర్లు అమార్ఫోఫేలస్ టైటానియమ్ (Amorphophallus titanum) అనే అడవి కంద జాతి మొక్క పుష్పించే పువ్వుకి కూడా వాడతారు. తెలుగులో రఫ్లెసియా పువ్వును శవం పువ్వు లేదా మాంసం పువ్వు అని అనువాదించవచ్చు. ఈ విచిత్రమైన రఫ్లెసియా మలేషియా దేశంలో ఇండొనేషియా రాష్ట్రీయ పుష్పం మరియూ థాయ్ లాండ్ దేశంలో సూరత్ థానీ ప్రొవిన్స్ రాష్ట్రీయ పుష్పం.

లంకెలు

మార్చు