రబ్రీ దేవి యాదవ్ (జననం 1 జనవరి 1956) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బీహార్‌ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసింది. రబ్రీ దేవి బీహార్ మాజీ ముఖ్యమంత్రి & భారత మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తల్లి.[1]

రబ్రీ దేవి యాదవ్
రబ్రీ దేవి


బీహార్ శాసనమండలి ప్రతిపక్ష నాయకురాలు
పదవీ కాలం
13 ఏప్రిల్ 2022 – 9 ఆగష్టు 2022
ముందు ప్రేమ్ కుమార్

శాసనసభ ప్రతిపక్ష నాయకురాలు
పదవీ కాలం
20 నవంబర్ 2005 – 23 డిసెంబర్ 2010
ముందు ఉపేంద్ర కుష్వాహా
తరువాత అబ్దుల్ బారి సిద్దికీ

పదవీ కాలం
11 మార్చి 2000 – 6 మార్చి 2005
గవర్నరు • వీ. సి. పాండే
• ఎం.ఆర్. జొయ్స్
• వేద్ ప్రకాష్ మార్వాహ (ఆపద్ధర్మ)
• బుటా సింగ్
గోపాలకృష్ణ గాంధీ
ముందు నితీష్ కుమార్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
9 మార్చి 1999 – 2 మార్చి 2000
గవర్నరు సుందర్ సింగ్ భండారి
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత నితీష్ కుమార్
పదవీ కాలం
25 జులై 1997 – 11 ఫిబ్రవరి 1999
గవర్నరు అఖ్లాఖ్ఉర్ రెహమాన్ కిద్వాయ్
ముందు లాలూ ప్రసాద్ యాదవ్
తరువాత రాష్ట్రపతి పాలన

పదవీ కాలం
4 ఏప్రిల్ 1995 – 25 జులై 1997
తరువాత లాలూ ప్రసాద్ యాదవ్
పదవీ కాలం
10 మార్చి 1990 – 28 మార్చి 1995
ముందు వీణ మిశ్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-01) 1956 జనవరి 1 (వయసు 68)
గోపాల్ గంజ్, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్
జీవిత భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్
సంతానం తేజస్వి యాదవ్ (కుమారుడు)
తేజ్ ప్రతాప్ యాదవ్ (కుమారుడు)
మిసా భారతి (కుమార్తె)
రాజ్ లక్ష్మి యాదవ్ (కుమార్తె)
నివాసం పాట్నా

రాజకీయ జీవితం మార్చు

రబ్రీ దేవి 25 జూలై 1997న బీహార్‌ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టింది. తన భర్త లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై అతనిపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కారణంగా రాజీనామా చేయవలసి రావడంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆమె 25 జూలై 1997 నుండి 2005 వరకు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించింది.[2] [3] రబ్రీ దేవి 2014 లోక్‌సభ ఎన్నికల్లో సరన్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడిపోయింది.[4]

వ్యక్తిగత జీవితం మార్చు

రబ్రీ దేవి 17 సంవత్సరాల వయస్సులో 1 జూన్ 1973న లాలూ ప్రసాద్ యాదవ్‌ను వివాహం చేసుకుంది. వారికీ 2 కుమారులు & 7 కుమార్తెలు ఉన్నారు.[5] [6] [7] [8] [9] [10]

 • పెద్ద కొడుకు: తేజ్ ప్రతాప్ యాదవ్
 • చిన్న కొడుకు: తేజస్వి యాదవ్
 • పెద్ద కూతురు: మిసా భారతి
 • 2వ కుమార్తె: రోహిణి ఆచార్య యాదవ్
 • 3వ కూతురు: చందా యాదవ్
 • 4వ కుమార్తె: రాగిణి యాదవ్ - సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాహుల్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు [11]
 • 5వ కూతురు: హేమా యాదవ్
 • 6వ కుమార్తె: అనుష్క యాదవ్ (ధన్ను) - చిరంజీవ్ రావుతో వివాహం
 • చిన్న కుమార్తె: రాజ్ లక్ష్మి యాదవ్ - తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు

ఎమ్మెల్యేగా మార్చు

# నుండి వరకు నియోజకవర్గం పార్టీ
1. 2000 2005 * రఘోపూర్ నుండి ఎమ్మెల్యే (మొదటిసారి) (ఉప ఎన్నిక)

* బీహార్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి (3వసారి).

రాష్ట్రీయ జనతా దళ్
2. ఫిబ్రవరి 2005 అక్టోబర్ 2005 రాఘోపూర్ నుండి ఎమ్మెల్యే (2వ పర్యాయం). రాష్ట్రీయ జనతా దళ్
3. 2005 2010 * రాఘోపూర్ నుంచి ఎమ్మెల్యే (3వ సారి).

* బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు

రాష్ట్రీయ జనతా దళ్
4. 2012 2018 బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ (2వ పర్యాయం). రాష్ట్రీయ జనతా దళ్
5. 2018 వర్తమానం బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ (3వ పర్యాయం). రాష్ట్రీయ జనతా దళ్

మూలాలు మార్చు

 1. "At a glance: Lalu Prasad, Rabri Devi and family" (in ఇంగ్లీష్). 24 May 2013. Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
 2. Ahmed, Farz (1997-08-11). "Dragged from the kitchen to Bihar Assembly, Rabri Devi learns politics fast : Cover Story - India Today". India Today. Archived from the original on 27 March 2017. Retrieved 2017-01-31.
 3. Mishra, Dipak (2017-02-17). "Proxy rule lessons from Bihar". The Telegraph. Archived from the original on 27 March 2017. Retrieved 2017-03-27.
 4. Vaibhav, Aditya (2014-05-17). "Election results 2014: JD(U), RJD decimated in Bihar". The Times of India. TNN. Archived from the original on 31 May 2014. Retrieved 2014-05-30.
 5. "Lalu paid off a debt to his wife handsomely". DNA. 19 November 2013.
 6. Thakurta, Paranjoy Guha (8 May 2004). "The durability of Laloo Prasad Yadav". Business Line. Archived from the original on 8 October 2012. Retrieved 24 February 2012.
 7. "Sons in Bihar cabinet, daughters wed to Mulayam kin - sprawling Lalu family tree spans party lines". The Print. 24 August 2022.
 8. "Rabri Devi". Hindustan Times. 7 February 2005. Archived from the original on 30 September 2007.
 9. "Rabri vividly recalls how she had boarded a steamer at Pahleja Ghat in Sonepur (Chapra) to reach the Patna residence soon after her marriage on March 18, 1974 when curfew had been imposed all over the district". Archived from the original on 24 December 2017. Retrieved 12 September 2016.
 10. Thakur, Sankarshan (27 March 2014). "A sibling swing at succession". The Telegraph. Archived from the original on 14 June 2014. Retrieved 2015-01-30.
 11. "Lalu's Swiss-educated son-in-law hops on Samajwadi cycle, chants growth mantra". Hindustan Times. 7 February 2017.