1987, జూలై 7న ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో జన్మించిన రవికాంత్ శుక్లా (Ravikant Shukla) భారత్ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన ఇతడు 2006లో శ్రీలంకలో కరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో భారత జట్టుకు నేతృత్వం వహించాడు. ఫస్ట్ క్లాస్ పోటీలలో ఉత్తర ప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.