కవిగా, వాకిలి అంతర్జాల పత్రిక సంపాదకునిగా తెలుగు సాహిత్యలొకానికి పరిచయమయిన రవి వీరెల్లి పూర్తి పేరు వీరెల్లి రవిందర్ రెడ్డి.

రవి వీరెల్లి
రవి వీరెల్లి
జననంజూన్ 16
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామం
నివాస ప్రాంతంవర్జీనియా
ఇతర పేర్లువీరెల్లి రవిందర్ రెడ్డి
వృత్తిసాఫ్ట్ వేర్ ఇంజినీర్
ప్రసిద్ధితెలుగు కవి, సంపాదకుడు
భార్య / భర్తసుచరిత
పిల్లలుఅభినవ్, అపూర్వ్
తండ్రికొమురా రెడ్డి
తల్లిరాజేశ్వరి

జీవితవిశేషాలు

మార్చు

రవి వీరెల్లి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో జన్మించాడు. నాగపూర్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నాక ఢిల్లీలో కొన్నాళ్ళు, ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్నాళ్ళ పాటు పనిచేసి అమెరికా వెళ్ళారు. ప్రస్తుతం వర్జీనియాలో ఐ.టి. మేనేజర్ గా పనిచేస్తున్నారు. 2012లో "దూప", 2017లో "కుందాపన" కవితా సంకలనాలని ప్రచురించారు. 2020లో రవి, స్వాతికుమారి కలిసి హెమింగ్వే నవలని "అతడే ఒక సముద్రం" పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. 2012 నుండి వాకిలి మాస పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా తెలుగు సంఘం వారు ప్రచురించే “అమెరికా భారతి” పత్రికకి కూడా సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. 2013 నాట్స్ సావనీర్ కి, 2014 ఆటా సావనీర్ కి సంపాదకత్వం వహించారు.

రచనలు

మార్చు
  1. దూప [1] 2012 (కవిత్వం)
  2. కుందాపన [2] 2017 (కవిత్వం)
  3. అతడే ఒక సముద్రం [3] 2020 (అనువాదం)

మూలాలు

మార్చు
  1. "దూప". Archived from the original on 2015-07-17. Retrieved 2015-06-18.
  2. "కుందాపన". Archived from the original on 2017-09-27. Retrieved 2017-09-13.
  3. అతడే ఒక సముద్రం