రస స్వరూపము

భారతీయ కావ్య సిద్ధాంతాలలో ప్రప్రథమమైనది రస సిద్ధాంతం .కావ్యానికి ఆత్మేది అనే విషయంపై ప్రాచ్య అలంకారికులు శతాబ్దాలతరబడి ఎన్నెన్నో చర్చలు చేసారు.వీటిలో ప్రధానమైన సిద్ధాంతాలు ఆరు ఉన్నాయి.అవి.1.రసం 2.అలంకారం. 3.రీతి .4.ధ్వని .5.వక్త్రోక్తి. 6.ఔచిత్యం. ఈ ఆరింటిలో రససిద్ధాంతమే ప్రధానమైనదిగా అలంకారికులు గుర్తించారు. రససిద్ధంత ప్రవక్త భరతుడు.మనకుతెలిసినన్తవరకు మొట్టమొదటి నాట్యశాస్త్రం భరతునిదే.ఇందులో 37 అధ్యాయాలు ఉన్నాయి.6వ అధ్యాయం రసభావ చర్చకి సంబంధించింది. రస శబ్ద అర్ధ వికాసం

రసం అనే పదం రుగ్వేదంలో సోమరసం, పాలు అనివాడబడింది.అధర్వణ వేదంలో నది, రుచి అని వాడబడింది.ఉపనిషత్తుల్లో సారం అని వాడబడింది.ఔశాధశాస్త్రంలో పాదరసం అని వాడబడింది.వేదాన్తశాస్త్రంలో ఆత్మా, పదార్థం అని వాడబడింది.లోకంలో పానకంలాంటి ద్రవ విశేషాలు అని అర్ధం ఉంది.అయితే అలంకారికులు చెప్పిన రసం ఏమిటంటే నాటక, కావ్య-కళా రసం.ఈ రసాన్ని సహృదయుడు అనుభవిస్తాడు