రాంపిళ్ల నరసాయమ్మ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర్య సమర యోధురాలు

రాంపిళ్ల నరసాయమ్మ విజయవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు. 2024 నవంబరు 14న కన్నుమూసారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[1]

రాంపిళ్ల నరసాయమ్మ
మరణం14-11-2024
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్యోద్యమం
జీవిత భాగస్వామిరాంపిళ్ల సూర్యనారాయణ

స్వాతంత్ర్య పోరాటం

మార్చు

నరసాయమ్మ, తన భర్త రాంపిళ్ల సూర్యనారాయణ, కలిసి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలో భాగంగా పోరాటాలలో పాల్గొనేవారు.[2] విజయవాడలో విద్యాధరపురం కొండపై పేలుడు పదార్థాలను తయారు చేసేవారు.[3] స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గోవా, పాండిచ్చేరిలోని స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు. నరసాయమ్మ 1956లో గోవాలో బాంబులు తీసుకెళ్తుండగా పట్టుబడి ఏడాదిపాటు కారాగారంలో ఉన్నారు. ఆ సమయంలో గర్భవతి అయిన ఆమె గోవా కారాగారంలో తన చిన్న కొడుకు రాంపిళ్ళ జయప్రకాష్‌కు జన్మనిచ్చింది.[4]

మూలాలు

మార్చు
  1. "స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మ కన్నుమూత - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-14. Retrieved 2024-11-15.
  2. ABN (2022-08-10). "దేశమంతా తిరుగుతూ బాంబులు బట్వాడా చేశాం". Andhrajyothy Telugu News. Retrieved 2024-11-15.
  3. "From bomb-making to peacemaking: Freedom fighter has journey across spectrum". The Times of India. 2022-08-07. ISSN 0971-8257. Retrieved 2024-11-15.
  4. Service, Express News (2024-11-14). "Freedom fighter Narasayamma passes away at 99 in Vijayawada". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-11-15.