రాకేష్ దౌల్తాబాద్

రాకేష్ దౌల్తాబాద్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బాద్షాపూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాకేష్ దౌల్తాబాద్

పదవీ కాలం
26 అక్టోబర్ 2019 – 25 మే 2024
ముందు రావ్ నర్బీర్ సింగ్
తరువాత రావ్ నర్బీర్ సింగ్
నియోజకవర్గం బాద్షాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1978/1979
దౌల్తాబాద్
మరణం (aged 45)
గురుగ్రామ్, హర్యానా, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
తల్లిదండ్రులు జిలే సింగ్, రోష్ణి దేవి
జీవిత భాగస్వామి కుముద్ని[1]
సంతానం మిలింద్ జంఘు, దేవ్ జంఘు
నివాసం గుర్గావ్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాకేష్ దౌల్తాబాద్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 శాసనసభ ఎన్నికలలో బాద్షాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి 2014 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన ఓడిపోయాడు. రాకేష్ దౌల్తాబాద్ 2019 ఎన్నికలలో బాద్షాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనీష్ యాదవ్‌పై 10,186 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాకేష్ దౌల్తాబాద్ 25 మే 2024న గురుగ్రామ్‌ పాలం విహార్‌లోని మణిపాల్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[3][4]

మూలాలు

మార్చు
  1. The Times of India (17 September 2024). "Once a fashion designer, now in election fray to fill the void left by her husband". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  2. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  3. Hindustantimes (25 May 2024). "Haryana's Badshahpur MLA Rakesh Daultabad dies of cardiac arrest". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  4. The New Indian Express (25 May 2024). "Independent MLA Rakesh Daulatabad dies of heart attack in Gurugram" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.