రాగన్నపట్టెడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం పులికాట్ సరస్సు మధ్యలో ఉంది.

గ్రామ పాఠశాల

మార్చు

రాగన్నపట్టెడ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న జి.నాగరాజు, 10వ తరగతి చదువుచున్న ఐ.జయప్రకాశ్ అను విద్యార్థులు, రాష్ట్రస్థాయి ఇన్స్ పైర్ వైఙానిక ప్రదర్శనకి ఎంపికైనారు. వీరు ఇటీవల నెల్లూరులో జరిగిన జిల్లా స్థాయి వైఙానిక ప్రదర్శనలో, వ్యర్ధ వృక్షాల సంబంధిత నూనెలు (ఎండిన అరటిపండ్ల తొక్కలు, వేపగింజలు) నుండి జీవ ఇంధనం (బయో డీజెల్) తయారుచేసే విధానాన్ని, చేసి చూపించారు. ఈ ప్రదర్శనను మెచ్చిన అధికారులు, వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసారు.

మూలాలు

మార్చు