రాగవర్ధిని రాగం
(రాగవర్ధని రాగము నుండి దారిమార్పు చెందింది)
రాగవర్థిని భారతీయ సాంప్రదాయ సంగీతంలో రెండు అర్థాలను కలిగి ఉంది.
- రాగాన్ని ఆలాపించడంలో ప్రధాన భాగం. గాయకుడు రాగాన్ని దశల వారీగా విస్తరణ చేస్తాడు. ప్రతి ప్రధాన నోట్ లేదా స్వరం వద్ద విరామం ఇస్తాడు.
- రాగవర్ధని రాగము కర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 32 వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని రాగచూడామణి అని అంటాడు. [2][3][4]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ: స రిగా మ ప ధని స
- S R3 G3 M1 P D1 N2 S
- అవరోహణ: సని ధ ప మగా రి స
- S N2 D1 P M1 G3 R3 S
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 68 వ మేళకర్త రాగమైన జ్యోతిస్వరూపిణి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు
మార్చుఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- రూపకలుషిత - రగణమఠ్య - వెంకటమఖి
- శ్వేతగణపతిం వందే - త్రిపుట - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - ధ్రువ - సుబ్బరామ దీక్షితులు
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras