రాచమల్లు శివప్రసాద రెడ్డి

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం ప్రొద్దుటూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 2 డిసెంబర్ 1966
రామేశ్వరం
ప్రొద్దుటూరు
కడప జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రాచమల్లు శివశంకర్‌రెడ్డి, మునిరత్నమ్మ
జీవిత భాగస్వామి రాచమల్లు రమాదేవి
సంతానం పల్లవి[1], కృష్ణ కావ్య
నివాసం ప్రొద్దుటూరు

జననం, విద్యాభాస్యం మార్చు

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, ప్రొద్దుటూరు, రామేశ్వరంలో రాచమల్లు శివశంకర్‌రెడ్డి, మునిరత్నమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో ఎస్.సి.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం మార్చు

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, 2003లో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా, సెప్టెంబరు 2004 నుండి 2005 మార్చి 5 వరకు మున్సిపల్‌ ఇన్‌చార్జి ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులు రెడ్డి పై 13025 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2019 లోటీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి పై 43148 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (7 September 2023). "కూతురికి ప్రేమ వివాహం జ‌రిపించిన వైసీపీ ఎమ్మెల్యే". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
  2. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  4. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  5. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.