రాజగోపాల కృష్ణ యాచేంద్ర
మహారాజా సర్ రాజగోపాల కృష్ణ యాచేంద్ర జి.సి.ఐ.ఇ సి.ఎస్.ఐ (1857-1916) వెంకటగిరి రాజవంశీకుడు, రాజకీయవేత్త. ఈయన 1878 నుండి 1916 వరకు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సంస్థానానికి 28వ మహారాజు. ఈయన పద్మనాయక వెలమ వంశమైన వెలుగోటి రాజవంశానికి చెందినవాడు. ఈయన 1888లో మద్రాసు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. వెంకటగిరి మహారాజుగానూ, శాసనమండలి సభ్యుడిగా ఉన్న కాలంలో ఈయన విద్యారంగాన్ని సంస్కరించి, ప్రోత్సహించాడు.
వెలుగోటి రాజగోపాల కృష్ణ యాచేంద్ర | |
---|---|
మహారాజా సాహిబ్ ముష్ఫీఖ్ మెహెర్బాన్ కరమ్ ఫర్మాగే ముష్కరీ ఉమ్ద్-ఏ-రాజా రాజా బహదూర్, వెంకటగిరి మహారాజా | |
పరిపాలన | 1879 నుండి 1916 |
Coronation | 1879 మార్చి 3 |
పూర్వాధికారి | వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర |
ఉత్తరాధికారి | వెలుగోటి గోవిందకృష్ణ యాచేంద్ర |
జననం | 1857 నవంబరు 25 |
మరణం | 1916 జూలై 23 |
వంశము | వెలుగోటి గోవిందకృష్ణ యాచేంద్ర |
రాజవంశం | వెలుగోటి |
తండ్రి | వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర బహదూర్ |
మతం | హిందూమతం |
రాజగోపాల కృష్ణ యాచేంద్ర మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అధికారేతర సభ్యుడు . అతను 1887 నుండి కౌన్సిల్లో పనిచేశాడు. ఈయన సోదరుడి మనవడైన రామకృష్ణ రంగారావు మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యాడు. [1] కోలంక మహారాణి దత్తత తీసుకున్న ఈయన మనవడు, ఆ తరువాత కాలంలో కోలంక మహారాజు అయ్యాడు. ఈయనే కోలంక కప్‌ను చేయించాడు.
గౌరవాలు
మార్చురాజగోపాల యాచేంద్రను, బ్రిటీషు ప్రభుత్వం 1888 మేలో నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (కెసిఐఇ) గా నియమించింది. ఆ తరువాత 1915లో వెలువడిన న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో నైట్ గ్రాండ్ కమాండర్ (జిసిఐఇ) గా పదోన్నతి పొందారు. [2] [3] ఈయనకు 1900 లో కైజర్-ఇ-హింద్ పతకం లభించింది. ఢిల్లీ దర్బార్ పతకాన్ని కూడా అందుకున్నాడు.
మూలాలు
మార్చు- ↑ K. C. Markandan (1964). Madras Legislative Council; Its constitution and working between 1861 and 1909. S. Chand & CO. pp. 148–188.
- ↑ "London Gazette, 1 June 1888". London-gazette.co.uk. 1888-06-01. Retrieved 2014-05-31.
- ↑ "London Gazette, 29 December 1914". London-gazette.co.uk. 1914-12-29. Retrieved 2014-05-31.