వెంకటగిరి సంస్థానం

వెంకటగిరి సంస్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని , సంస్థానాల్లోకెల్లా అతిపెద్దదైన, ప్రాచీనమైన సంస్థానాల్లో ఒకటి.[1] నెల్లూరు ప్రాంతంలోని ఈ సంస్థానాన్ని భారతస్వాతంత్ర్యం వరకూ దాదాపుగా 350 సంవత్సరాలకు పైగా అర్థస్వతంత్ర పరిపాలకులు, సంస్థానాధీశుల హోదాలో వెలుగోటి వంశస్థులు పరిపాలించారు. వెలుగోటి పెద్దరాయలు గజపతుల సామంతునిగా 16వ శతాబ్ది చివరికాలంలో వ్యవహరించేవారు. ఆ తర్వాత వెంకటగిరికి వచ్చి పాలకులుగా స్థిరపడ్డారు. 1750నాటికి ఆర్కాటు నవాబుకు సామంతులుగా వ్యవహరించి, 1802 నుంచి 1947 వరకూ బ్రిటీష్ వారి కింద సంస్థానాధీశులుగా ఉన్నారు.[2] ఈ సంస్థానం వేంకటగిరి, సగుటూరు, మల్లాం, పోలూరు, మనుబ్రోలు, పెళ్ళూరు, పొదిలె, దర్శి, కొచ్చెర్లకోట, మారెళ్ళ అని పది తాలూకాలుగా విభజించబడి పరిపాలించబడింది.

వెంకటగిరి సంస్థానం
జమీందారీ , బ్రిటీషు ఇండియా
1600–1949

Coat of arms of వెంకటగిరి

Coat of arms

చరిత్ర
 -  Established 1600
 -  జమీందారీ రద్దు 7 సెప్టెంబరు
విస్తీర్ణం
 -  1901 4,103.34 km2 (1,584 sq mi)
జనాభా
 -  1901 60,861 
Density 14.8 /km2  (38.4 /sq mi)
వెంకటగిరి కోట

పరిపాలకుల పూర్వచరిత్ర

మార్చు
 
వెంకటగిరి సంస్థానాధీశులు అధిష్టించిన బంగారు సింహాసనం.
 
వెంకటగిరి రాజ వంశం

వెంకటగిరి సంస్థానం పరిపాలకులు వెలుగోటి వంశీకులు. వెలుగోటి వంశీయుల పూర్వీకుని పేరు చెవిరెడ్డి. ఆయనకే భేతాళనాయుడు అన్నది మరొకపేరు. వారికి తొలినాటి ఇంటిపేరు పిల్లలమఱ్ఱి. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతనిని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలంలో 'సనద్' ను పొందారు. తమ వంశం జమీందార్లు 'రాజా' అనే బిరుదును వాడుతూ వచ్చారు.

వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమనాయుడు 1614లో రెండవ తిరుమల దేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయలు వారసునిగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడారు. వారసత్వపు తగాదాల్లో జగ్గరాయుడు అనే రాచబంధువు శ్రీరంగరాయల కుటుంబాన్ని అంతా చంపేసినా, రంగరాయల కుమారుడు కుమారుడైన రామదేవరాయలను సింహాసనంపై నిలిపారు.[3]

మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. అతని వారసులు:

  • వెలుగోటి నిర్వాణ రాయప్ప (పెద్ద రాయుడు), 15వ రాజు (వెంకటగిరి), చికాకోల్ నవాబు షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి నిర్వాణ రాయప్పకు బహూకరించి, చికాకోల్ కు ఇతని గౌరవార్థం 'బెబ్బులి' గా పేరు మార్చాడు. (తరువాత బొబ్బిలిగా రూపాంతరం చెందింది) 'రాజా', 'బహాదుర్' బిరుదులను ప్రదానం చేశాడు.
  • వెలుగోటి కుమార యాచమ నాయుడు (1777/1804) (జననం 1762 ఫిబ్రవరి 23) (మరణం 1804 మార్చి 18) - 25 వ తరం
  • వెలుగోటి బంగారు యాచమ నాయుడు (1804/1847) (మరణం 1847 డిసెంబరు 25) - 26 వ తరం
  • వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచమ నాయుడు (వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర) (1848/1878) (జననం 1832 జనవరి 3, మరణం 1892) - 27 వ తరం
  • రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857, మరణం 1916) - 28 వ తరం
  • రామకృష్ణ యాచేంద్ర, తరువాత శ్రీ రాజా రావు వెంకట సూర్య మహీపతి రామకృష్ణారావు బహదూర్ గా పేరుగాంచాడు. (పిఠాపురం 'రాజా' చే దత్తత తీసుకోబడ్డాడు).
  • రంగమన్నార్‌ కృష్ణ యాచేంద్ర, తరువాత మహారాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు గా పేరు గడించాడు, (బొబ్బిలి 'రాణి' చే దత్తత తీసుకోబడ్డాడు).
  • రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
  • వెలుగోటి గోవిందకృష్ణ యాచేంద్ర బహదూర్, (1917 - 1937) (జననం, 15 అక్టోబరు 1879 మరణం 1937) - 29 వ తరం
  • వెలుగోటి సర్వజ్ఞ కృష్ణ బహదూర్ (1937 - 1971) (మరణం 1971) - 30 వ తరం
  • వెలుగోటి సాయికృష్ణ యాచేంద్ర బహదూర్ (1971 - ) - 31 వ తరం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. శ్రీరామ్, వీరబ్రహ్మమ్ (1918). నానారాజన్య చరిత్రము. p. 2.
  2. వి., రాజగోపాల్ (28 March 2014). "విలువైన వెంకటగిరి చరిత్ర". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 13 April 2015.
  3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

వెలుపలి లంకెలు

మార్చు