రాజబాబు (నటుడు)
రాజబాబు తెలుగు సినీమా, టీవీ, రంగస్థల నటుడు. ఆయన 1995లో “ఊరికి మొనగాడు” సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మొత్తం 62సినిమాల్లో, 48 సీరియల్స్‌లో నటించాడు. అయన 2005వ సంవత్సరంలో “అమ్మ” సీరియల్‌లోని పాత్రకు గాను నంది అవార్డు అందుకున్నాడు.[1]
రాజబాబు | |
---|---|
జననం | 13 జూన్ 1957 |
మరణం | 24 అక్టోబర్ 2021 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - 2021 |
జననం
మార్చురాజబాబు 1957 జూన్ 13లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలం, నరసాపురపేటలో జన్మించాడు. ఆయన తండ్రి చిత్ర నిర్మాత బొడ్డు బసవతారకం కాకినాడలో చిన్న రైస్ మిల్లు వ్యాపారం చేస్తూ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “, “రాధమ్మ పెళ్లి ” అనే రెండు సినిమాలను నిర్మించాడు.[2]
నటించిన పలు సినిమాలు
మార్చు- ఊరికి మొనగాడు (1995)
- సింధూరం
- సముద్రం
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
- మురారీ
- శ్రీకారం
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
- కళ్యాణ వైభోగం
- మళ్ళీ రావా
- బ్రహ్మోత్సవం
- భరత్ అనే నేను
నటించిన పలు సీరియల్స్
మార్చు- వసంత కోకిల
- అభిషేకం
- రాధా మధు
- మనసు మమత
- బంగారు కోడలు
- బంగారు పంజరం
- నా కోడలు బంగారం
- చి ల సౌ స్రవంతి
మరణం
మార్చురాజబాబు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన నివాసంలో 2021 అక్టోబరు 24న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కమారులు, కుమార్తె ఉన్నారు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ Eenadu (25 October 2021). "Rajababu: సినీ నటుడు రాజబాబు కన్నుమూత". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Sakshi (25 October 2021). "టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత". Archived from the original on 26 October 2021. Retrieved 27 October 2021.
- ↑ TV9 Telugu (25 October 2021). "నటుడు రాజబాబు కన్నుమూత." Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (25 October 2021). "క్యారెక్టర్ నటుడు రాజబాబు ఇకలేరు". chitrajyothy. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ 10TV (25 October 2021). "ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత | Famous Character Artist Rajababu Dies at 64" (in telugu). Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)