రాజశ్రీ శాంతారామ్

రాజశ్రీ శాంతారామ్ (జననం 1944 అక్టోబరు 8), ఒక భారతీయ నటి. ఆమె జాన్వర్ (1965), బ్రహ్మచారి (1968) చిత్రాలలో తన నటనకు బాగా ప్రసిద్ది చెందింది. ఆమెను రాజశ్రీ అని పిలుస్తారు.

రాజశ్రీ
1966లో రాజశ్రీ
జననంరాజశ్రీ శాంతారామ్
(1944-10-08) 1944 అక్టోబరు 8 (వయసు 80)
బాంబే, బ్రిటీష్ రాజ్
పౌరసత్వంఅమెరికన్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1954,
1961–1973
భార్య / భర్తగ్రెగ్ చాప్మన్
తల్లిదండ్రులువి. శాంతారామ్ (తండ్రి),
జయశ్రీ (తల్లి)

వ్యక్తిగత జీవితం

మార్చు

రాజశ్రీ, ప్రముఖ భారతీయ చిత్రనిర్మాత వి. శాంతారామ్, ఆయన మొదటి భార్య నటి జయశ్రీల కుమార్తె, రాజశ్రీ సోదరుడు కిరణ్ శాంతారామ్ ముంబై మాజీ షెరీఫ్.

అరౌండ్ ది వరల్డ్ చిత్రం చిత్రీకరణకు రాజ్ కపూర్ తో కలిసి అమెరికా వెళ్ళినప్పుడు, ఆమె అమెరికన్ విద్యార్థి గ్రెగ్ చాప్మన్ (Greg Chapman)ను కలుసుకుంది. మూడు సంవత్సరాల తరువాత, ఐదు రోజుల పాటు జరిగిన భారతీయ సాంప్రదాయ వేడుకలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి వెళ్ళింది.[1] వీరికి ఒక కుమార్తె ఉంది. వారు లాస్ ఏంజిల్స్ నివసిస్తున్నారు.[2][3]

ఆమె,, తన భర్తతో కలిసి విజయవంతంగా కస్టమ్ దుస్తుల వ్యాపారాన్ని నడుపుతోంది, అదే సమయంలో సినిమాలపై తన ఆసక్తిని తగ్గలేదు. ఆమె హాక్-ఓ-లాంటన్, టెయింటెడ్ లవ్, మాన్సూన్ వటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. "అశోక్ బై అనదర్ నేమ్" అనే పిల్లల వీడియోకి కథనాన్ని కూడా అందించింది.


ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1954 సుబాహ్ కా తారా సోగీ, మోహన్ సోదరి
1961 స్ట్రీ
1963 గ్రహాస్తి కిరణ్ ఖన్నా
1963 ఘర్ బసకే దేఖో శారదా మెహ్రా
1964 షెహనాయ్ ప్రీతి
1964 జీ చాహతా హై
1964 గీత్ గయా పథరోన్ నే విద్యా
1965 డూ దిల్ బిజ్లీ
1965 జాన్వర్ సప్నా
1966 సాగాయి షీల్
1966 మొహబ్బత్ జిందగి హై నీటా
1967 దిల్ నే పుకారా ఆశా
1967 గుణహోన్ కా దేవతా
1967 అరౌండ్ ది వరల్డ్ రీటా
1968 సుహాగ్ రాత్
1968 బ్రహ్మచారి శీతల్ చౌదరి
1973 నైనా రవి మొదటి భార్య

మూలాలు

మార్చు
  1. "Actress Rajshree Honored by Jain Group". India West. 2013-03-11. Archived from the original on 15 May 2013. Retrieved 5 May 2013.
  2. India Today International. Living Media India Limited. October 2000. p. 106. Retrieved 5 May 2013.
  3. The Hindu Weekly Review. K. Gopalan. January 1968. p. 18. Retrieved 5 May 2013.