ఇది 1977లో విడుదలైన తెలుగు సినీమా. సన్యాసీరాజా అనే హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడింది. రాజా రమేష్ చిత్రం జూలై 21 న దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జగ్గయ్య , కాంచన ముఖ్య తారాగణంతో, రూపొందిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

రాజా రమేష్
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన్ రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సుగుణ పిక్చర్స్
భాష తెలుగు

కథ మార్చు

రాజా రమేష్ (నాగేశ్వరరావు) ఓ జమిందారు. సంగీత నాట్యాల పత్ల అనురక్తితో భార్య (వాణిశ్రీ) ను, బాధ్యతలనూ నిర్లక్ష్యం చేస్తాడు. అతని దగ్గరపనిచేసె వ్యక్తి (జగ్గయ్య) అవకాశాన్ని వినియోగించుకుని రాజా అడ్డు తొలగించి, అతని భార్యను లోబరుచు కుంటాడు. కొంత కాలం తరువాత రాజా ఒక సన్యాసి రూపంలో తిరిగి వస్తాడు. అతనెలా తను రాజా నని నిరూపించుకుంటాడు అనేది చిత్ర ముగింపు.

తారాగణం మార్చు

అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ

కాంచన

జగ్గయ్య

హలం

ఇతర వివరాలు మార్చు

పాటలు మార్చు

"నెల్లూరి నెరజాణా నజరైన చినదానా" (రెడియోలో రామకృష్ణ, తెరపై బాలు)

1:, వాయించు ఆది తాళం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2:నేలమీద జాబిలినింగిలోని.. గానం.ఎస్.పి.బాలు. పి సుశీల,రచన: ఆత్రేయ

3:ఎంతోరసికుడుదేవుడు.గానంపి.సుశీల, రచన:. ఆత్రేయ

4: చంద్రుడు కనబడలేదనీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల రచన: ఆత్రేయ

5: నెల్లూరి నెరజాణ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: ఆత్రేయ

6: ఎంతో రసికుడు దేవుడు (మేల్ వాయిస్) గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆత్రేయ

మూలాలు మార్చు


భాహ్యా లంకెలు మార్చు