వీరమాచనేని మధుసూదనరావు
వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. ఆయన తన 95వ ఏట, 2012 జనవరి 11న అనారోగ్యంతో మరణించారు.[1]
వీరమాచనేని మధుసూదనరావు | |
---|---|
![]() వీరమాచనేని మధుసూదనరావు | |
జననం | వీరమాచనేని మధుసూదనరావు జులై 27 1923 |
మరణం | 11 జనవరి 2012 |
మరణ కారణము | అనారోగ్యం |
ఇతర పేర్లు | వి.మధుసుదనరావు |
ప్రసిద్ధి | తెలుగు సినిమా దర్శకులు |
భార్య / భర్త | వీరమాచనేని సరోజిని |
పిల్లలు | వీణా, వాణి |
"విక్టరీ" నే యింటి పేరు చేసుకొన్న వి.మధుసూదన రావు గారు 1923 జులై 27 జన్మించి లో కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి ఐ.ప్రసాద్, తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1958 లో చదలవాడ కుతుంబరావు నిర్మించిన "సతీ తులసి" చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. ఆ తరువాత వి.బి.రాజేంద్ర గారి "జగపతి" వారి "అన్నపూర్ణ" సినిమాకు దర్శకత్వం వహించగా అది 100 రోజులు ఆడి విజయవంతమయింది. 1962 లో సూపర్ స్టార్ కృష్ణని పరిచయం చేస్తూ "పదండి ముందుకు" తీశారు. తెలుగు పరిశ్రమకు మూల స్తంబాలైన ఎన్.టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లతో ఎన్నో విజయ వంతమైన చిత్రాలు తీశారు. శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ వంటి రెండో తరం హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఒక దశలో జగపతి సంస్థకు మధుసూదనరావు గారే రెగ్యులర్ డైరక్టరు. నేటీ హీరోలు నాగార్జునని "విక్రం" ద్వారా, జగపతి బాబుని "సింహస్వప్నం" ద్వారా,రమేష్ బాబుని "సమ్రాట్" చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. అగ్ర శ్రేణి దర్శకులైన కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.సి.రెడ్డి, గి.సి.శేఖర్,బోయిన సుబ్బారవు, వంశీ,శివ నాగేశ్వరరావు, మొకలైన వారు ఈయన దగ్గర శిష్యరికం చేసినవారే. మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చి మధు ఫిల్ం ఇనిస్టిట్యూట్ స్థాపించి ఎంతో మందిని నటులుగా తీర్చి దిద్దారు. 1964 లో తనతో పాటు ప్రజా నాట్య మండలిలో పనిచేసిన సరోజినిని ఆదర్శాలకు కట్టుబడి వివాహం చేసుకున్నారు. ఆమె తరువాత పూర్తిగా మహిళలతో సినిమా తీసి గిన్నిస్ రికార్డుకి ఎక్కారు. తెలుగు చలన చిత్ర సీమలో 50 సంవత్సరాలుగా కొనసాగుతూ నాలుగు భాషలలో కలిపి 71 చిత్రాలకు దర్శకత్వం వహించి "వీరమాచనేని"కి బదులు "విక్టరీ" నే ఇంటిపెరు చేసుకున్నారు.
సినిమాలుసవరించు
- సతీ తులసి (1959)
- వీరాభిమన్యు (1965)
- ట్యాక్సీ రాముడు (1961)
- ఆరాధన (1962)
- పదండి ముందుకు (1962)
- రక్తసంబంధం (1962)
- లక్షాధికారి (1963)
- ఆత్మ బలం (1964)
- అంతస్థులు (1965)
- గుడి గంటలు (1965)
- మంచి కుటుంబం (1965)
- ఆస్తిపాస్తులు (1966)
- డ్రైవర్ ఆనంద్ (1966)
- జమీందార్ (1966)
- లక్ష్మీనీవాసం (1968)
- అదృష్టవంతులు (1968)
- ఆత్మియులు (1969)
- మనుషులు మారాలి (1969)
- లవ్ కుశ (హింది)
- దేవి (1970)
- సమాజ్ కొ బాదల్ డాలో (1970))
- కళ్యాణ మండపం (1971)
- మంచి రోజు లోస్తాయి (1972)
- కన్న కొడుకు (1973)
- భక్త తుకారాం (1973)
- కృష్ణవేణి (1974)
- ప్రేమలు పెళ్ళిలు (1974)
- జేబు దొంగ (1975)
- చక్రధారి (1977)
- ఎదురీత (1977)
- ఈ తరం మనిషి (1977)
- అంగడి బొమ్మ (1978)
- మల్లెపూవు (1978)
- జుదగాడు (1979)
- శివమెత్తిన సత్యం (1979)
- ఛండీ ప్రియ (1980)
- జీవిత రథం (1981)
- పులి బిడ్డ (1981)
- బంగారు కనుక (1982
- విక్రమ్ (1986)
- సామ్రాట్ (1987)
- కృష్ణగారి అబ్బాయి (1989)
మూలాలుసవరించు
- ↑ తెలుగ్గోడు, (సాక్షి వార్త) (11 January 2012). "తెలుగ్గోడు: 'విక్టరీ' మధుసూదన్ రావు కన్నుమూత". teluggodu.blogspot.com. Archived from the original on 22 జనవరి 2020. Retrieved 20 April 2020.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help)
యితర లింకులుసవరించు
- వి.మధుసూధన రావు వ్యాసం
- "విక్టరీల దర్శకుడు!". సితార. Archived from the original on 2020-08-01. Retrieved 2020-08-01.