రాజీవ్ స్మృతి భవన్
17°43′02″N 83°19′42″E / 17.717231°N 83.328225°E
రాజీవ్ స్మృతి భవన్ | |
---|---|
స్థాపితం | 2008 |
ప్రదేశం | బీచ్ రోడ్, విశాఖపట్నం |
రకం | సాంస్కృతిక కేంద్రం |
ఓనర్ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
రాజీవ్ స్మృతి భవన్, విశాఖపట్నంలోని పాండురంగపురం, బీచ్ రోడ్ వద్ద ఉన్న స్మారక, సాంస్కృతిక కేంద్రం. 2008 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాశశేఖరరెడ్డి దీనిని ప్రారంభించాడు.[1]
చరిత్ర
మార్చుభారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాడు. ఆ తరువాత తమిళనాడులోని పెరంబదూర్ లో జరిగిన బాంబు దాడిలో మరణించాడు. ఆయన ఆఖరిసారి సమావేశం జరిపిన ప్రాంతం ఇదే కనుక ఆయన జ్ఞాపకంగా 2008లో ఇక్కడ రాజీవ్ స్మృతి భవన్ నిర్మించారు.
కార్యకలాపాలు
మార్చురాజీవ్ గాంధీకి ఈ స్మారక, సాంస్కృతిక కేంద్రం అంకితం చేయబడింది. ఇది రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను తెలిపేలా ఫోటోల ప్రదర్శనకు,[2] శాస్త్రీయ, కర్ణాటక సంగీతానికి వేదికగా ఉంది.[3]
ఇతర వివరాలు
మార్చు2014లో వచ్చిన హుదూధ్ తుఫాన్ కారణంగా ఈ భవనం చెడిపోగా, అప్పటి రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామి రెడ్డి ఎంపి నిధులతో బాగుచేయించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Visakhapatnam: Rajiv Bhavan stands as Hudhud Memorial". Deccan Chronicle. 28 January 2016. Retrieved 2021-05-24.
- ↑ Subrahmanyam, G. S. (23 November 2014). "Multi-activity centre mooted at Rajiv Smruthi Bhavan". Retrieved 2021-05-24 – via www.thehindu.com.
- ↑ "Rajiv Smruthi Bhavan: Latest News, Videos and Photos - Times of India". The Times of India. Retrieved 2021-05-24.
- ↑ Subrahmanyam, G. S. (2014-11-23). "Multi-activity centre mooted at Rajiv Smruthi Bhavan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-24.