తిక్కవరపు సుబ్బరామిరెడ్డి

(టి. సుబ్బరామి రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (ఆంగ్లం: T. Subbarami Reddy) (జ. సెప్టెంబరు 17, 1943) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ లోక్‌సభ లకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యాడు.[1]

తిక్కవరపు సుబ్బరామిరెడ్డి
తిక్కవరపు సుబ్బరామిరెడ్డి
జననంతిక్కవరపు సుబ్బరామిరెడ్డి
సెప్టెంబరు 17, 1943
నెల్లూరు
ప్రసిద్ధిరాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత , పారిశ్రామికవేత్త
పదవి పేరుపార్లమెంటు సభ్యుడు
పదవీ కాలం1996 , 1998 సంవత్సరాలలో 11వ , 12వ లోక్‌సభ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
భార్య / భర్తఇందిరా సుబ్బరామిరెడ్డి
తండ్రిబాబు రెడ్డి,
తల్లిరుక్మిణమ్మ

సుబ్బరామిరెడ్డి 1943, సెప్టెంబర్ 17న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.[2] హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైనది.

సినిమా నిర్మాణం

మార్చు

ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

ఇతడు నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:

తెలుగు
  1. జీవన పోరాటం
  2. స్టేట్ రౌడి
  3. గ్యాంగ్ మాస్టర్
  4. సూర్య ఐ.పి.ఎస్
హిందీ
  1. దిల్‌వాలా
  2. చాందినీ
  3. లమ్హే
  4. స్వామి వివేకానంద
సంస్కృతం
  1. భగవద్గీత

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-18. Retrieved 2008-07-22.