రాజు శ్రీవాస్తవ

సత్య ప్రకాష్ శ్రీవాస్తవ (1963 డిసెంబరు 25 - 2022 సెప్టెంబరు 21) ఒక భారతీయ హాస్యనటుడు, రాజకీయ నాయకుడు. బాలీవుడ్ నటుడైన ఆయన ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ బోర్డ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన గజోధర్‌గా ఘనత పొందాడు.

రాజు శ్రీవాస్తవ
ఒక కార్యక్రమంలో రాజు శ్రీవాస్తవ
జన్మ నామంసత్య ప్రకాష్ శ్రీవాస్తవ
జననం (1963-12-25) 1963 డిసెంబరు 25 (వయసు 61)
కాన్పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం2022 సెప్టెంబరు 21
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
మాధ్యమంహింధీ
కళలుఅబ్జర్వేషనల్ కామెడీ, స్టాండింగ్ కామెడీ
భార్య లేక భర్తశిఖా శ్రీవాస్తవ
విశేష కృషి, పాత్రలుది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్పై స్టాండప్ కామెడీ

జీవితం తొలి దశలో

మార్చు

1963 డిసెంబరు 25న కాన్పూర్‌లో మధ్యతరగతి కుటుంబంలో రాజు శ్రీవాస్తవ జన్మించాడు. అతని తండ్రి రమేష్ చంద్ర శ్రీవాస్తవ, బాలై కాకా అని పిలువబడే కవి. రాజు శ్రీవాస్తవ చిన్నప్పటి నుంచి మిమిక్రి కళాకారుడు కావడంతో హాస్యనటుడు కావాలనే కోరిక ఉండేది.

కెరీర్

మార్చు

భారతదేశంతో పాటూ విదేశాలలో రాజు శ్రీవాస్తవ ఎన్నో స్టేజ్ షోలను ప్రదర్శించాడు. ఆయన ఆడియో క్యాసెట్‌లు, వీడియో సీడీలను కూడా విడుదల చేశాడు. ఆయన అమితాబ్ బచ్చన్ లుక్-అలైక్‌గా ప్రారంభ గుర్తింపు పొందాడు. బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించాడు. రాజశ్రీ ప్రొడక్షన్స్ సినిమా మైనే ప్యార్ కియాలో, బాజీగర్, బాంబే టు గోవా వంటి ప్రజాధరణ పొందిన చిత్రాలలో చిన్న పాత్రలు పోషించాడు. ఆయన బాలీవుడ్ చిత్రం అమ్దాని అత్తన్ని ఖర్చ రూపయ్యలో హాస్యనటుడిగా మెప్పించాడు. ఆయన టాలెంట్ షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌తో స్టాండ్-అప్ కామెడీలోకి ప్రవేశించాడు. ఇందులో రెండవ రన్నరప్‌గా నిలిచాడు. తదనంతరం స్పిన్-ఆఫ్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ - ఛాంపియన్స్‌లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ రాజు శ్రీవాస్తవను కాన్పూర్ నుంచి పోటీకి పెట్టాలని చివరిదశలో విరమించుకుంది.[1][2][3] ఆ తర్వాత 2014 మార్చి 19న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4][5][6] స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను నామినేట్ చేశారు.[7] అప్పటి నుండి అతను వివిధ నగరాల్లో తన కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతను ప్రోత్సహిస్తున్నాడు. అతను పరిశుభ్రత ప్రచారం కోసం వివిధ మ్యూజిక్ వీడియోలను రూపొందించాడు. అతను స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం వివిధ టీవీ ప్రకటనలు, సామాజిక సేవా సందేశ వీడియోను కూడా చిత్రీకరించాడు.[8]

వ్యక్తిగత జీవితం

మార్చు

లక్నోకు చెందిన శిఖాను 1993 జులై 1న వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, అంతారా, ఆయుష్మాన్. 2010లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, పాకిస్థాన్‌పై తన షోల సమయంలో జోకులు వేయవద్దని హెచ్చరిస్తూ పాకిస్థాన్ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 58 ఏళ్ల ఆయన 2022 ఆగస్టు 11న జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యాడు.[9] అప్పటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్యులు ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా 2022 ఆగస్టు 25న స్పృహలోకి వచ్చాడు.[10]

కొద్దిరోజులుగా న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న రాజు శ్రీవాస్తవ 2022 సెప్టెంబరు 21న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు.[11]

మూలాలు

మార్చు
  1. "Akhilesh Yadav turns to comedy, fields Raju Srivastava from Kanpur in Lok Sabha election". Indian Express. 14 February 2013. Archived from the original on 12 March 2014. Retrieved 12 March 2014.
  2. "Comedian Raju Srivastava returns SP Lok Sabha ticket". The Hindu. 11 March 2014. Archived from the original on 11 March 2014. Retrieved 12 March 2014.
  3. "Comedian Raju Srivastava Returns SP Lok Sabha Ticket". The New Indian Express. Archived from the original on 26 September 2019. Retrieved 26 September 2019.
  4. "Jagdambika Pal, comedian Raju Srivastava join BJP, endorse Narendra Modi". Zee News. 19 March 2014. Archived from the original on 19 March 2014. Retrieved 19 March 2014.
  5. IANS (19 March 2014). "News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates". News18. Archived from the original on 26 April 2014. Retrieved 25 April 2014.
  6. "Jagdambika Pal, artiste Raju Srivastava join BJP". Indian Express. 19 March 2014. Archived from the original on 26 September 2019. Retrieved 26 September 2019.
  7. "Raju Srivastav files complaint against using his image in anti-BJP message". The New Indian Express. Archived from the original on 3 November 2019. Retrieved 3 November 2019.
  8. "Raju Srivastav files complaint against using his image in anti-BJP message". The New Indian Express. 25 October 2017. Archived from the original on 3 November 2019. Retrieved 3 November 2019.
  9. "నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు". Sakshi. 2022-08-11. Retrieved 2022-08-11.
  10. "Raju Srivastava LIVE: 15 दिन बाद होश में आए राजू श्रीवास्तव, जानें कॉमेडियन की हेल्थ से जुड़ा हर अपडेट". Amar Ujala (in హిందీ). Retrieved 2022-08-25.
  11. "Comedian Raju Srivastava dies at 58, confirms family - Hindustan Times". web.archive.org. 2022-09-21. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)