మైనే ప్యార్ కియా
మైనే ప్యార్ కియా 2014లో విడుదలైన తెలుగు సినిమా. యూనిఫై క్రియేషన్స్ బ్యానర్‌పై సన వెంకట్ రావు, ఉపేంద్ర కుమార్ గిరడ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ మాదుగుల దర్శకత్వం వహించాడు. ప్రదీప్, సత్యదేవ్, ఇషా తల్వార్, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 20న విడుదల చేశారు.
మైనే ప్యార్ కియా | |
---|---|
దర్శకత్వం | ప్రదీప్ మాదుగుల |
నిర్మాత | సన వెంకట్ రావు ఉపేంద్ర కుమార్ గిరడ |
తారాగణం |
|
సంగీతం | వి ప్రదీప్ కుమార్ |
నిర్మాణ సంస్థ | యూనిఫై క్రియేషన్స్ |
విడుదల తేదీ | 20 జూన్ 2014 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చునవీన్(ప్రదీప్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నవీన్ రోజూ తన ఆఫీసులో ఉన్న అమ్మాయిలని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితురాలు శాలిని(ఇషా తల్వార్) అదే ఆఫీసులో చేరుతుంది. ఆమెతో గతంలో నవీన్ కి ఒక చేదు అనుభవంఉండడం వల్ల తను ఎవరనేది చెప్పకుండా శాలినితో పరిచయం పెంచోకోగా, అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో శాలినికి నవీన్ తన ప్రేమ గురించి చెప్పే క్రమంలో తన గతం తెలిసి బ్రేకప్ చెబుతుంది. అసలు శాలిని నవీన్ కి మధ్య గతంలో ఏమి జరిగింది ? ఈ క్రమంలో శాలినిని నవీన్ ఒపించాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
మార్చు- ప్రదీప్ ర్యాన్
- సత్యదేవ్
- ఇషా తల్వార్
- మధుమిత
- అభినవ్ గోమఠం
- కోమల్ ఝా
- పోసాని కృష్ణ మురళి
- ఉత్తేజ్
- ప్రవీణ్
- కత్తి మహేష్
- హర్ష చెముడు
- నారిపెద్ది శివన్నారాయణ
- వెన్నెల రామారావు
- కోటేశ్వరరావు
- స్వప్నిక
- సుధాకర్ వర్మ
- కుమార్ తేజ
- సర్వమంగళ
- ల్యాబ్ శరత్
- ముద్దమందారం ప్రదీప్
- సరస్వతి
- సురేష్
- ప్రాచీ
పాటల జాబితా
మార్చుకదలకుండా, గానం. ప్రదీప్ కుమార్
ఈ ప్రేమ మనకొద్దు , గానం.సీన్ రోల్డన్
శ్వాసే నువ్వే , గానం.శక్తిశ్రీ గోపాలన్ , ప్రదీప్ కుమార్
నింగిలోన ,(వెర్షన్1.) గానం.ప్రదీప్ కుమార్
అడిగిందే , గానం.అభయ్ జోధపుర్కర్ , కళ్యాణి నాయర్
పండు ,(థీమ్) గానం.చిన్నా, గణేష్ కుమార్, పోసాని.
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: యూనిఫై క్రియేషన్స్
- నిర్మాతలు: సన వెంకట్ రావు, ఉపేంద్ర కుమార్ గిరడ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ మాదుగుల
- సంగీతం: వి ప్రదీప్ కుమార్
- సినిమాటోగ్రఫీ:ఎస్.వి.విశ్వ
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (21 June 2014). "Movie review 'Maine Pyar Kiya': Good attempt by a debutant director!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.