రాజేంద్ర లాహిరి

భారతీయ విప్లవకారుడు

రాజేంద్ర లాహిరి (1901 జూన్ 29 - 1927 డిసెంబరు 17 ), పూర్తి పేరు రాజేంద్ర నాథ్ లాహిరి. అతను భారతీయ మార్క్సిస్ట్ విప్లవకారుడు, అతను కకోరి కుట్ర, దక్షిణేశ్వర్ బాంబు దాడి వెనుక సూత్రధారి. అతను బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టడానికి ఉద్దేశించిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో క్రియాశీల సభ్యుడు.

రాజేంద్ర నాథ్ లాహిరి
రాజేంద్ర లాహిరి విగ్రహం
జననం(1901-06-29)1901 జూన్ 29
పబ్నా జిల్లా, బెంగాల్ ప్రెడిడెన్సీ
మరణం1927 డిసెంబరు 17(1927-12-17) (వయసు 26)
గోండా జైలు, యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా
విద్యబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం

ప్రారంభ జీవితం

మార్చు

రాజేంద్ర లాహిరి 1901 జూన్ 29 న లాహిరి బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లోని పాట్నా జిల్లాకు చెందిన మోహన్‌పూర్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి క్షితిష్ మోహన్ లాహిరికి అక్కడ పెద్ద ఎస్టేట్ ఉండేది. [1]

దక్షిణేశ్వర్ బాంబు ఘటన

మార్చు

లాహిరి దక్షిణేశ్వర్ బాంబు దాడి ఘటనలో పాల్గొని పరారయ్యాడు. అతను బనారస్ వెళ్లి చదువు ప్రారంభించాడు. ఉత్తర ప్రదేశ్‌లో విప్లవాత్మక కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు అతను బనారస్ హిందూ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ఎం.ఏ విద్యార్థి. అతను అనేక ఇతర బెంగాలీ స్నేహితులతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరాడు.

కాకోరీ కుట్ర

మార్చు

అతను 1925 ఆగస్టు 9 న కాకోరి రైలు దోపిడీకి ప్రధాన సూత్రధారి. బెంగాల్‌లోని దక్షిణేశ్వర్‌లో గతంలో జరిగిన బాంబు కేసులో అతన్ని అరెస్టు చేసి, పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. రైలు దోపిడీ కోసం లక్నోలో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమైనప్పుడు , అతను కకోరి కుట్ర కేసులో కూడా చేర్చబడ్డాడు. అనేక ఇతర విప్లవకారులతో పాటు విచారణ ఎదుర్కొన్నాడు.

సుదీర్ఘ విచారణ తర్వాత అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. షెడ్యూల్ చేసిన తేదీకి రెండు రోజుల ముందు అనగా 1927 డిసెంబరు 17 న గోండా జిల్లా జైలులో ఠాకూర్ రోషన్ సింగ్, అష్పాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్‌తో పాటు ఉరితీయ బడ్డాడు.

మూలాలు

మార్చు
  1. "Some Prominent Martyrs of India's Freedom Struggle". All India Congress Committee. Archived from the original on 2009-03-29. Retrieved 18 September 2014.