రాజోలిబండ డైవర్షన్ స్కీం

రాజోలిబండ డైవర్షన్ స్కీం మహబూబ్ నగర్ జిల్లా లోని నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి. దీనిని సంక్షిప్తంగా RDS అంటారు. దీనిని కర్ణాటక, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా తుంగభద్ర నది పై కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఒక కాలువ ద్వారా గద్వాల, అలంపూర్ ప్రాంతాలలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాటుచేశారు.[1]. ఈ ప్రాంతాలలో లోని కాలువల పునర్నిర్మాణానానికై మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం లోని రాజోలి గ్రామ సమీపాన, తుంగభద్రకు దక్షిణాన ఉన్న కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజిలోకి స్లూయిస్ రంధ్రాల ద్వారా నీటిని మళ్ళించారు. కాలువల నిర్మాణం పూర్తయ్యాక రంధ్రాల పూడ్చివేతకు ప్రాజెక్టు అధికారులు ప్రయత్నిస్తే రాయలసీమ ప్రాంతపు రాజకీయనాయకులు, రైతులు అడ్డుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఇరుప్రాంత రైతుల మధ్య ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 10