రాజ్యం సిన్హా, జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు. శాంతినికేతన్ విద్యార్థిని. ఈమె భర్త బిజయ్ కుమార్ సిన్హా భగత్ సింగ్ అనుయాయి. బ్రిటీషు వారిపై బాంబు విసిరాడన్న అభియోగంపై జీవతకాల శిక్ష అనుభవించాడు. బిజయ్ కుమార్ సిన్హా స్వాతంత్ర్య సమరయోధుడుగా, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చి, రాజమండ్రి జైలులో ఉన్నాడు. ఆచార్య రంగా మాట్లాడి రాజ్యం-సిన్హా పెళ్ళికి కారకుడయ్యాడు.

రాజ్యం సిన్హా మద్రాసు నుంచి ”మాతృభూమి ” వారపత్రికను నడిపే వారు. ఆమె ముదునూరు కాంగ్రెస్ నాయకులు అన్నే అంజయ్య అన్న కుమార్తె. శాంతినికేతన్ విద్యార్థిని. ఆమె భర్త విజయకుమార్ సిన్హా ” The Times of India ”లో ఎడిటింగ్ సెక్షన్ లో పని చేసే వారు. ఆయన విప్లవ వీరుడు భగత్ సింగ్ అనుచరుడు. భగత్ సింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన తరువాత సిన్హా మైనర్ అయినందు వల్ల అండమాన్ దీవులకు పంపింది ప్రభుత్వం. ఆయన అక్కడ జైలర్లకు ఒక విద్యాలయం ఏర్పాటు చేసి, దేశ స్వాతంత్ర్యపు అవసరాన్ని జాతీయ పోరాటచరిత్ర మున్నగు విషయాలను ప్రభావం చేస్తూ ప్రసంగించే వారు. తన అండమాన్ జీవితాన్ని గురించి ”, The Andamaan’s –The Indian Bastille ”. అనే గ్రంథం వ్రాశారు .

మామిడిపూడి వెంకటరంగయ్య మనమరాలు శాంతా సిన్హాను పెళ్ళి చేసుకున్న వీరి ఏకైక కుమారుడు అజొయ్ 1979లో అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి, మెదడులో అంతఃస్త్రావంతో మరణించాడు.

రాజ్యం సిన్హా 1951లో విజయవాడ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రేస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసి వామపక్షాల మద్దతున్న హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ చేతిలో ఓడిపోయింది[1]

యివి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Ramana Rao, G.V. (April 1, 2009). "When Andhra was a Left bastion". The Hindu. Archived from the original on 3 ఏప్రిల్ 2009. Retrieved 16 January 2010.

యితర లింకులు

మార్చు