నాగపూర్

మహారాష్ట్ర లోని ఒక పట్నం
(నాగపూర్ (మహారాష్ట్ర) నుండి దారిమార్పు చెందింది)

నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం, మహారాష్ట్ర రెండవ రాజధాని. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.[3] ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.[4] ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. నాగపూర్ ను గోండు రాజు భక్త్ బులంద్ షా స్థాపించాడు . గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. వీరు బ్రిటిష్ వాళ్ళకు లొంగి పోయారు.19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ , బేరార్ కు కేంద్రంగా చేసుకుంది.

  ?నాగపూర్
మహారాష్ట్ర • భారతదేశం
మారుపేరు: నారింజ నగరం
సున్నా మైలురాయి.
సున్నా మైలురాయి.
సున్నా మైలురాయి.
అక్షాంశరేఖాంశాలు: 21°05′N 79°02′E / 21.08°N 79.03°E / 21.08; 79.03
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
218 కి.మీ² (84 sq mi)
• 310 మీ (1,017 అడుగులు)
ప్రాంతం విదర్భ
జిల్లా (లు) నాగపూర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
24,20,000[1] (2006 నాటికి)
• 11,101/కి.మీ² (28,751/చ.మై)
అధికార భాష మరాఠి, హిందీ, ఆంగ్లం,గోండీ
మేయర్ మాయాతాయి ఇవనాతే
మునిసిపల్ కమిషనర్ సంజయ్ సేథీ
స్థాపన 18వ శతాబ్దం [2]
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 4400xx
• +91-712
• MH-31,MH-40
వెబ్‌సైటు: www.nagpur.nic.in
Seal of నాగపూర్
Seal of నాగపూర్

రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా, నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ , విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు - పడమర ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 6 ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 7 కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.

ప్రముఖులు మార్చు

  1. సుబ్రమణియం రామదొరై: భారత ప్రభుత్వ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ పై ప్రధానమంత్రి సలహాదారు.[5] 

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ""The world's largest cities"". City Mayors. Retrieved 2006-06-26.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-15. Retrieved 2008-08-18.
  3. ""Some 108 million people live in India's largest cities"". City Mayors.
  4. "Nagpur". Maharashtra Government.
  5. "S. Ramadorai" Archived 2011-03-07 at the Wayback Machine.

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నాగపూర్&oldid=3987088" నుండి వెలికితీశారు