తెలంగాణ రాజ్‌భవన్ (హైదరాబాదు)
రాజ్‌భవన్ హైదరాబాదులోని సోమాజీగూడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనం. ఇది రాష్ట్ర గవర్నరు అధికారిక నివాసం.[1]
రాజ్‌భవన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
పూర్తి చేయబడినది | 1936 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
సాంకేతిక విషయములు | |
పరిమాణం | 21.5 ఎకరాలు (8.7 హె.) |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | ఎరిక్ మర్రెట్, జైన్ యార్ జంగ్ |
మూలాలు | |
రాజ్‌భవన్ చరిత్ర (గవర్నర్ అధికారిక జాలగూడు) |
చరిత్ర
మార్చుసోమాజీగూడాకు చెందిన నవాబ్ షారోజ్ జంగ్, సయ్యద్ అఖిల్ బిల్‌గ్రామీ నివాస స్థలాన్ని 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనుగోలు చేసి తమ ఆస్థానంలో పనిచేసే ప్రధానమంత్రికి గృహాలకోసం నిర్మించాడు. సర్ అక్బర్ హైద్రీ (1936-41), నవాబ్ చత్తారీ (1941-46), మీర్జా ఇస్మాయిల్ (1946-47), మెహిదీ యార్ జంగ్ (నవంబరు-డిసెంబరు 1947), మీర్ లాయక్ అలీ (1947-48) మొదలైన వారు ఈ భవనంలో నివసించారు.
నిర్మాణం
మార్చుఎరిక్ మర్రెట్, జైన్ యార్ జంగ్ ఆధ్వర్యంలో 1930నాటి అంతర్జాతీయ స్థాయి డిజైన్లతో ఓడ ఆకారంలో 21.5 ఎకరాల్లో ఈ భవనం నిర్మించబడింది. ఇందులోని దర్బార్ హాలును 1936లో నిర్మించారు. ఇస్లామిక్ ఆర్చ్ సిమెంట్ జాలీలుతో ఉన్న ఈ భవనం నిజాం రాజులు నిర్మించిన అందమైన భవనాల్లో ఒకటిగా నిలుస్తుంది.
కార్యక్రమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ రాజ్‌భవన్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 128
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (14 December 2018). "కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను..అంతఃకరణ శుద్ధితో." Archived from the original on 3 June 2019. Retrieved 3 June 2019.
- ↑ The Hans India, Telangana (5 April 2019). "Hyderabad: Pre-Ugadi celebrations at Raj Bhavan today". Roja Mayabrahma. Archived from the original on 3 June 2019. Retrieved 3 June 2019.
- ↑ ఈనాడు, హైదరాబాదు (2 June 2019). "గవర్నర్ ఇఫ్తార్ విందు.. సందడిగా రాజ్‌భవన్!". Archived from the original on 3 June 2019. Retrieved 3 June 2019.
ఇతర లంకెలు
మార్చు- గవర్నర్ అధికారిక జాలగూడు Retrieved 3 June 2019.
- రాజ్‌భవన్ చరిత్ర (గవర్నర్ అధికారిక జాలగూడు) Retrieved 3 June 2019.