మీర్ లాయక్ అలీ

నిజాంల పాలనలోని హైదరాబాద్ రాష్ట్ర చివరి ప్రధానమంత్రి.

మీర్​ లాయక్​ అలీ (1903 - 24 అక్టోబరు 1971) నిజాంల పాలనలోని హైదరాబాద్ రాష్ట్ర చివరి ప్రధానమంత్రి.[1] ఇతనికి అధికారికంగా "హైదరాబాద్ నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్" బిరుదు ఉంది.

మీర్​ లాయక్​ అలీ
1948 ఆపరేషన్ పోలో సమయంలో మీర్​ లాయక్​ అలీ
హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి
In office
29 నవంబరు 1947 – 19 సెప్టెంబరు 1948
అంతకు ముందు వారునవాబ్ మెహదీ యార్ జంగ్
తరువాత వారుపదవి రద్దు
హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి
అంతకు ముందు వారునవాబ్ మెహదీ యార్ జంగ్
వ్యక్తిగత వివరాలు
జననం1903
మరణం24 అక్టోబరు 1971

జననం మార్చు

లాయక్ అలీ 1903లో జన్మించాడు.[2]

కెరీర్ మార్చు

మీర్ లాయక్ అలీ ఇంజనీర్, పారిశ్రామికవేత్త. 1947 నవంబరు నుండి 1948 సెప్టెంబరులో ఆపరేషన్ పోలో "పోలీసు చర్య" వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధాన మంత్రిగా పనిచేశాడు.[3] తన హయాంలో హైదరాబాద్ స్వతంత్ర దేశంగా నిలదొక్కుకోవడానికి పోరాడాడు.[4] హైదరాబాదీ రక్షణ దళాలు ఓడిపోయి, హైదరాబాద్‌ భారత యూనియన్‌లో విలీనం చేసిన తరువాత, లాయక్ ను బేగంపేటలోని తన ఇంటిలో గృహ నిర్బంధంలో ఉంచారు. 1950 మార్చిలో పాకిస్తాన్ వెళ్ళి, అక్కడి ప్రభుత్వంలో పనిచేశాడు.

మరణం మార్చు

లాయక్ అలీ పాకిస్తాన్ తరపున అధికారిక నియామకంలో ఉన్న సమయంలోనే 1971, అక్టోబరు 24న న్యూయార్క్‌లో మరణించాడు. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మదీనాలో అంత్యక్రియలు జరిగాయి.

రచనలు మార్చు

మీర్ లాయక్ అలీ తన అనుభవాలతో ట్రాజెడి ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాశాడు.[5] ఈ పుస్తకాన్ని హైద్రాబాద్ విషాదం పేరుతో ఏనుగు నరసింహారెడ్డి తెలుగులోకి అనువదించాడు.

మూలాలు మార్చు

  1. "Tragedy of Hyderabad resurfaces after 50 years". Siasat. Retrieved 30 January 2012.
  2. "Mir Laiq Ali". Google Arts & Culture (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-24. Retrieved 2021-10-15.
  3. "Mir Laiq Ali, the captain who ensured the sinking of Hyderabad ship". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-17. Retrieved 2021-10-15.
  4. సాక్షి, ఫ్యామిలీ (24 February 2020). "లాయక్‌ అలీ విషాదం". Sakshi. Archived from the original on 22 October 2020. Retrieved 15 October 2021.
  5. "Tragedy of Hyderabad resurfaces after 50 years - southindia - Hyderabad - ibnlive". Ibnlive.in.com. Archived from the original on 17 October 2012. Retrieved 30 January 2012.

బయటి లింకులు మార్చు

అంతకు ముందువారు
నవాబ్ మెహదీ యార్ జంగ్
హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి
1947 - 1948
తరువాత వారు
పదవి రద్దు