రాజ్ శ్రీకాంత్ ఠాక్రే (జననం. స్వరరాజ్ శ్రీకాంత్ థాకరే; 1968 జూన్ 14) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చైర్మన్.[1] బాల్ థాకరే, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే బంధువు.

రాజ్ ఠాక్రే
రాజ్ థాకరే


మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 మార్చి 2006

వ్యక్తిగత వివరాలు

జననం (1968-06-14) 1968 జూన్ 14 (వయసు 55)
ముంబై, మహారాష్ట్ర,భారతదేశం
రాజకీయ పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (2006– ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన ( 2006 వరకు)
జీవిత భాగస్వామి షర్మిల ఠాక్రే
సంతానం 2
నివాసం శివాజీ పార్క్, దాదర్, ముంబై
పూర్వ విద్యార్థి ముంబై యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్య మార్చు

రాజ్ థాకరే 1968 జూన్ 14న శ్రీకాంత్ థాకరే ( బాల్ థాకరే తమ్ముడు), కుందా థాకరే (బాల్ థాకరే భార్య మీనా థాకరే చెల్లెలు) దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. చిన్నతనంలో తబలా, గిటార్, వయోలిన్ నేర్చుకున్నాడు.[2] థాకరే ముంబైలోని సర్ JJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేట్,[3] గ్రాడ్యుయేషన్ తర్వాత బాల్ థాకరేకు చెందిన మార్మిక్‌ వారపత్రికలో కార్టూనిస్ట్‌గా చేరాడు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

మరాఠీ సినిమా ఫోటోగ్రాఫర్, నిర్మాత-దర్శకుడు మోహన్ వాఘ్ కుమార్తె షర్మిలా వాఘ్‌తో రాజ్ థాకరే వివాహం జరిగింది.[4] వీరికి కుమారుడు (అమిత్ ఠాక్రే), కుమార్తె (ఊర్వశి ఠాక్రే) ఉన్నారు.[5] [6] [7]

రాజకీయ జీవితం మార్చు

భారతీయ విద్యార్థి సేన అనే శివసేన విద్యార్థి విభాగాన్ని ప్రారంభించడం ద్వారా ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1990 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యత సంతరించుకున్నాడు. 1990లలో బాలాసాహెబ్ వారసుడిని పరిచయమయ్యాడు. అయినప్పటికీ, బాలాసాహెబ్ తన సొంత కుమారుడు ఉద్ధవ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. దాంతో 2005 నవంబరు 27న శివసేనకు రాజీనామా చేసి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. 2006 మార్చి 69న ముంబైలో, రాజ్థా కరే మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించాడు. అది ఇప్పుడు మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీగా నడుస్తోంది.[8]

మూలాలు మార్చు

  1. "Raj Thackeray". Business Standard. 2022. Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  2. 2.0 2.1 MNS official website Archived 17 డిసెంబరు 2013 at the Wayback Machine Accessed October 2011.
  3. "The return of Raj". Hindustan Times (in ఇంగ్లీష్). 31 October 2009. Retrieved 27 March 2019.
  4. "Raj Thackeray Birthday : वयाचे अंतर ते बाळासाहेबांच्या मित्राची मुलगी, अशी आहे राज आणि शर्मिला ठाकरे यांनी 'लव्ह स्टोरी'". Loksatta (in మరాఠీ). 14 June 2022. Retrieved 16 June 2022.
  5. "Mumbai Scottish just doesn't sound nice". DNA. No. 12 May 2008. Diligent Media Corporation, an Essel Group company. 2008. Retrieved 29 November 2020.
  6. "Now, miscreants target Thackeray kids' school". Times of India. No. 12 May 2008. Times of India. 2008. Retrieved 24 September 2020.
  7. "From wife Sharmila to daughter-in-law Mitali Bourde, know all about Raj Thackeray's family tree". Times Now (in ఇంగ్లీష్). 22 August 2019. Retrieved 18 August 2020.
  8. Business Standard Political Profiles of Cabals and Kings. Business Standard Books. 2009. pp. 89–90. ISBN 978-81-905735-4-2.