రాణి అవంతీబాయి

భారతీయ ఉద్యమకారుని

అవంతీబాయి లోధీ (1831 ఆగస్టు 16 - 1858 మార్చి 20) భారతీయ రాజపుత్ రాణి, పాలకురాలు. స్వాతంత్ర్య సమరయోధురాలు కూడా. ఆమె మధ్యప్రదేశ్‌లోని రామ్‌గఢ్ (ప్రస్తుత దిండోరి) రాణి. 1857 భారతీయ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రత్యర్థి, ఆమెకు సంబంధించిన సమాచారం చాలా తక్కువగా ఉన్నా జానపద కథల నుండి కాస్త వెలుగులోకి వచ్చింది. ఆమె లోధి రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందినది కావున 21వ శతాబ్దంలో లోధి రాజ్‌పుత్ రాజకీయాల్లో ఆమె ఒక ఐకాన్‌గా నిలిచింది.

రాణి అవంతీబాయి
2001లో భారతదేశం పోస్టల్ స్టాంపుపై అవంతీబాయి
జననం(1831-08-16)1831 ఆగస్టు 16
మరణం1858 మార్చి 20(1858-03-20) (వయసు 26)
జాతీయతభారతీయురాలు

సంస్థానాధీశులు ఎందరు లొంగిపోయినా రాణీ అవంతీబాయి మాత్రం బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారిపై ఎత్తిన ఖడ్గాన్ని దించలేదు. ఏడాదిన్నరపాటు 1857 మే 10 నుండి 1858 నవంబరు 1 వరకు సాగిన మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధంలో రాణి రాణి అవంతీబాయి శత్రుసైన్యంతో పొరాడింది. గెరిల్లా యుద్ధ వ్యూహంతో వారిని ఎదుర్కొన్న ఆమె శత్రువుకు సజీవంగా చిక్కరాదని తన సైనికుడి దగ్గర ఉన్న ఖడ్గాన్ని లాక్కుని 1858 మార్చి 20న ప్రాణత్యాగం చేసుకుంది.[1]

జీవితం తొలి దశలో మార్చు

అవంతీబాయి లోధీ 1831 ఆగస్టు 16న సివ్‌నీ జిల్లాలోని మంకేహడి గ్రామంలో లోధి రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు జుజార్ సింగ్. ఆమె రామ్‌గఢ్ (ప్రస్తుత దిండోరి) రాజా లక్ష్మణ్ సింగ్ కుమారుడు రాజ్‌పుత్ యువరాజు విక్రమాదిత్య సింగ్ లోధిని వివాహం చేసుకుంది. ఆమెకు అమన్ సింగ్, షేర్ సింగ్ అనే ఇద్దరు పిల్లలు. 1851లో రాజా లక్ష్మణ్ సింగ్ మరణించాడు. ఆ తరువాత రాజా విక్రమాదిత్య రాంగఢ్ రాజు అయ్యాడు. మైనర్ బాలుర సంరక్షకురాలిగా ఉన్న ఆమెకు రాజ్యాధికారం వచ్చింది. రాణిగా ఆమె రాష్ట్ర వ్యవహారాలను సమర్థంగా నిర్వహించింది. బ్రిటిష్ వారి సూచనలను పాటించవద్దని రాణి రాష్ట్ర రైతులను ఆదేశించింది. ఈ సంస్కరణతో ఆమె ప్రజాదరణ పొందింది.[2]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "UP Govt Will Launch Mission Shakti Campaign Crimes Against Women - Sakshi". web.archive.org. 2023-03-05. Archived from the original on 2023-03-05. Retrieved 2023-03-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Sarala, Śrīkr̥shṇa (1999). Indian Revolutionaries A Comprehensive Study, 1757–1961. Vol. 1. Ocean Books. p. 79. ISBN 81-87100-16-8.