సివ్‌నీ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సివ్‌నీ జిల్లా (హిందీ:) ఒకటి. సివ్‌నీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

Seoni జిల్లా
सिवनी जिला
మధ్య ప్రదేశ్ పటంలో Seoni జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Seoni జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుJabalpur
ముఖ్య పట్టణంSeoni (Madhya Pradesh)
Government
 • లోకసభ నియోజకవర్గాలుBalaghat
విస్తీర్ణం
 • మొత్తం8,758 కి.మీ2 (3,381 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం13,78,876
 • జనసాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.01%
 • లింగ నిష్పత్తి984
సగటు వార్షిక వర్షపాతం1384 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
పెంచ్ టైగర్ రిజర్వ్ దృశ్యం

భౌగోళికం

మార్చు

సివ్‌నీ జిల్లా సాత్పురా మైదానంలో భాగం. మైదానంలో వైంగంగా ఉంది. ఇది అధికంగా అరణ్యాలతో కప్పబడి ఉంది.ఈ జిల్లా సారవంతమైన లోయలకు, ప్రకృతి సౌందర్యానికి నిలయమై ఉంది.[1] ఉత్తర, పశ్చిమ భాగంలో లక్ష్నడన్, సివ్‌నీ జిల్లాలు ఉన్నాయి. తూర్పు భూభాగంలో వైంగంగా ముఖద్వారం ఉంది. అలాగే జిల్లా ఆగ్నేయ భూభాగంలో ఇరుకైన రాళ్ళతో నిండిన డొంగర్‌తల్ లోయ ఉంది. సముద్రమట్టానికి లక్ష్నడన్, సెనోయి మైదానాలు 1800 - 2000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇది సారవంతమైన అరణ్య రహితమైన అనుకూల వాతావరణం కలిగిన భూమి.[1] భౌగీళికంగా ఉత్తర సెయోనీ భూభాగంలో కొండలు, దక్షిణ సెయోనీ భూభాగంలో క్రిస్టలైజ్డ్ రాళ్ళు ఉంటాయి. మైదానం మూడింట రెండు వంతులు నల్లరేగడి మట్టితో నిండి ఉంటుంది. దక్షిణ భూభాగంలో గ్నెయిసెస్ క్లిఫ్ట్, ఇతర మైన శిలలు ఉంటాయి. ఇక్కడి మట్టి సిలిసెయెస్, పెద్ద ఎత్తున బంకమట్టి ఉంటుంది.[1] జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నది వైనగంగా. సాగర్, థెలి, బింజ, థంవర్ వంటి ఇతర నెర్బుద్ద నది ఉపనదులు, జలప్రవాహాలు ఉన్నాయి. వార్షిక వర్షపాతం 53 అంగుళాలు. ప్రధాన పంటలు గోధుమలు, సజ్జలు, వడ్లు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పత్తి.[1] జిల్లా వైశాల్యం 8,758.2.[2]

చరిత్ర

మార్చు

1956 నవంబరు 1 న సివ్‌నీ జిల్లా రఒందించబడింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న సెరోనా ప్రజల పేరు జిల్లాపేరుగా నిర్ణయించబడింది. [2]

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న సివ్‌నీ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,378,876,[4]
ఇది దాదాపు. స్విడ్జర్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 355 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 157 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.2%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 984:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.01%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
2001 గణాంకాల ప్రకారం - జనసంఖ్య 1,165,893,
నగరీకరణ శాతం
ఇందులో పురుషుల సంఖ్య 588,135
స్త్రీలసంఖ్య 577,758
స్త్రీ పురుష నిష్పత్తి 982:1000
జాతీయ సరాసరి 928 కంటే
1991 నుండి 2001 వరకు జనాభా అభివృద్ధి 16.89%

[7]

ప్రజలు

మార్చు

జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు 36% ఉన్నారు.[2] సివ్‌నీ జిల్లాలో గోండు ప్రజలు అధికంగా ఉన్నారు. .[8] జిల్లాలో బర్గి ప్రజలు కూడా అధికంగా ఉన్నారు. గోండులు జిల్లాలో 250 జిల్లాలలో ఉన్నారు.

సంస్కృతి

మార్చు

రుడ్‌యార్డ్ కిప్లింగ్ " ది జంగిల్ బుక్ " పుస్తకం సెనోయు జిల్లా నేపథ్యంలో వ్రాయబడింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Seoni". Classic Encyclopedia (based on the 11th edition of Encyclopaedia Britannica, published 1911). Retrieved 2010-08-19.
  2. 2.0 2.1 2.2 "Seoni, Madhya Pradesh". District administration. Retrieved 2010-08-19.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  7. "Population, decadal growth rate, sex ratio and density – States/Union territories and Districts : 2001". Table 1. Education for all in India, Source:Registrar General of India, Government of India, New Delhi. Archived from the original on 2009-09-17. Retrieved 2010-08-12.
  8. "Madhya Pradesh: DATA HIGHLIGHTS: THE SCHEDULED TRIBES, Census of India 2001" (PDF). Govt. of Madhya Pradesh. Retrieved 2010-08-20.

వెలుపలి లింకులు

మార్చు
  • [1] list of places in Seoni

వెలుపలి లింకులు

మార్చు