రాణీ ముఖర్జీ

భారతీయ సినీ నటి

రాణీ ముఖర్జీ (జననం 21 మార్చి 1978) ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికి ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.

రాణీ ముఖర్జీ
రాణీ ముఖర్జీ చిత్రం
2018 లో "హిచ్కి" ప్రొమోటింగ్ సందర్భంలో రాణీ ముఖర్జీ
జననం (1978-03-21) 1978 మార్చి 21 (వయసు 46)
కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
విద్యాసంస్థఎస్.ఎన్.డి.టి మహిళా విశ్వవిద్యాలయం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1
తల్లిదండ్రులు
  • రాం ముఖర్జీ (తండ్రి)
పురస్కారాలుపూర్తి జాబితా

భారతీయ సినీరంగంలోని ప్రముఖ ముఖర్జీ-సమర్థ్ కుటుంబానికి చెందిన రాణీ ముందు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ఆమె చిన్నతనంలో తన తండ్రి తీసిన బెంగాలీ చిత్రం బియర్ ఫూల్ (1996) లో సహాయ  నటిగా కనిపించారామె. 1997లో రాజా కీ ఆయేగీ బారాత్  సినిమాలో తల్లి కోరిక మేరకు హీరోయిన్ గా నటించారు రాణీ. ఇక సినిమారంగంలో కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమెకు కుచ్ కుచ్ హోతా హై (1998) సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ అయింది.హీరోయిన్ గా ఆమె నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆ తరువాత మూడేళ్ళు ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. 2002లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో ఆమె నటించిన సాథియా సినిమాతో మళ్ళీ గుర్తింపులోకి వచ్చారు రాణీ.

2004లో ఆమె నటించిన హమ్ తుమ్, యువ, వీర్-జారా సినిమాలతో బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు రాణీ. 2005లో బ్లాక్ చిత్రంలో చెవిటి, గుడ్డి, మూగ అమ్మాయిగా ఆమె  నటించిన తీరు ప్రేక్షకులనే కాక, విమర్శకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాలోని నటనకు ఆమెకు ప్రశంసల జల్లు కురిసింది అంటే అతిశయోక్తి కాదు. కభీ అల్విదా నా కెహ్నా (2006) చిత్రంలో కూడా మంచి నటన కనబరిచారామె. ఆ తరువాత కొన్నేళ్ళ వరకూ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. వరుస ఫ్లాప్ లతో ఆమె కెరీర్ కొన్నాళ్ళు ఆగిపోయింది. కొంతమంది హీరోలతో మాత్రమే, కొన్ని రకాలైన పాత్రలను మాత్రమే చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఆమె. 2011లో నో వన్ కిల్డ్ జెస్సికా సినిమాతో కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్నారు రాణీ. ఆ తరువాత తలాష్:ది ఆన్సర్ లైస్ వితిన్ (2012), మర్దానీ (2014), మర్దానీ 2 (2019) వంటి హిట్ సినిమాల్లో నటించారు ఆమె.

సినిమాల్లో నటించడమే కాక, రాణీ మంచి దాతగానూ పేరొందారు. స్త్రీలు, చిన్నారులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారిపై చూపుతున్న వివక్ష గురించి ఆమె ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఎన్నో టూర్లలో కచేరీల్లోనూ, స్టేజ్ షో లలోనూ పెర్ఫార్మ్ చేశారు. 2009లో డాన్స్ ప్రీమియర్ లీగ్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు చెప్పకపోయినా, మీడియా చాలా సార్లు ఆమె విషయాలు బయటపెడుతూనే వచ్చింది. ఆమె సినీ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప ఉంది.

తొలినాళ్ళ జీవితం, నేపథ్యం

మార్చు

రాణీ 21 మార్చి 1978న ముంబై లో జన్మించారు.[1] ఆమె తండ్రి రామ్ ముఖర్జీ సినీ దర్శకుడు, ఫిల్మాలయా స్టుడియోస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. తల్లి కృష్ణ ముఖర్జీ సినీ నేపథ్యగాయని.[2] ఆమె అన్నయ్య రాజా ముఖర్జీ దర్శక నిర్మాత.[3] రాణీ పిన్ని (తల్లి చెల్లెలు) దేబశ్రీ రాయ్ బెంగాలీ నటి, కజిన్ కాజోల్ బాలీవుడ్ లో ప్రముఖ నటి, రాణీ సమకాలీకురాలు  కూడా.[4] మరో కజిన్ అయన్ ముఖర్జీ స్క్రిప్ట్ రచయిత, దర్శకుడు.[5] ఆమె కుటుంబంలోని వారు, బంధువులు ఇంతమంది సినీరంగంలో ఉన్నా ఆమెకు ఈ రంగంలోకి రావడం మొదట్లో అస్సలు నచ్చేదికాదట.[6] "ఇప్పటికే ఇంటినుంచి కావలసినంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు నేను వేరేగా అవ్వాలనుకుంటున్నాను" అని అనేవారట రాణీ.[7]

జుహులో మనెక్ జీ కూపర్ హై స్కూల్ లో చదువుకున్నారు రాణీ. ఎస్.ఎన్.డి.టి విమెన్స్ విశ్వవిద్యాలయంలో హోం సైన్స్ లోడిగ్రీ పట్టా అందుకున్నారు.[6][8] ఆమె10వ తరగతి చదువుకునేప్పటినుంచీ ఒడిస్సీ నృత్యం నేర్చుకున్నారు.[9] ఆమె కుటుంబం ఆచారం ప్రకారం ప్రతీ ఏడూ దుర్గాపూజ ఘనంగా నిర్వహిస్తుంటారు రాణీ. ముంబైలోని సాంటాక్రూజ్ ప్రాంతంలో వీరి కుటుంబం నిర్వహించే దుర్గాపూజ చాలా ప్రసిద్ధమైనది. ఆమె తన కుటుంబంలో జరిగే అన్ని పండుగల్లోనూ పాలు పంచుకుంటారు.[10][11]

ఇవి కూడా చూడండి

మార్చు
  1. "Wish Rani Mukerji!"
  2. Sen, Raja (14 November 2007).
  3. Khubchandani, Lata (22 August 2002).
  4. Roy, Gitanjali (22 April 2014).
  5. Joshi, Tushar (12 August 2008).
  6. 6.0 6.1 Khubchandani, Lata (16 February 2012).
  7. Singh, Asha (11 October 2001).
  8. Mukherjee, Haimantee (15 January 2012).
  9. Upadhyay, Karishma (11 September 2002).
  10. Kashyap, Archita (22 September 2011).
  11. "Rani Mukerji to celebrate Durga Puja with family".