రాణీ రసమణి
రాణీ రసమణి లేదా రసమణి దాస్ (సెప్టెంబరు 28, 1793 - ఫిబ్రవరి 19, 1861) బెంగాలుకు చెందిన జమీందారు, వ్యాపారవేత్త, దాత. ఈమె ప్రసిద్ధమైనదక్షిణేశ్వర కాళికాలయం నిర్మించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస ఈ ఆలయంలో పూజారిగా ఉన్నాడు. ఆయన ఈ ఆలయంలో పూజారిగా చేరిన తర్వాత తరచు ఆయనను కలవడానికి వెళుతూ ఉండేది. ఈమె పందొమ్మిదివ శతాబ్దం మొదట్లోనే సంఘ సంస్కర్తగా పేరు గాంచింది. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలకపాత్ర పోషించింది. బెంగాల్ ప్రావిన్స్‌లోని వలసవాద సమాజంలోని అన్ని రంగాలలో వారి ఉనికిని ఆక్రమించిన బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అనేక ప్రతిఘటనలకు కూడా ఆమె నాయకత్వం వహించింది. ఆమె యాత్రికుల కోసం సుబర్ణరేఖ నది నుండి పూరీ వరకు రహదారి నిర్మించింది. బాబూఘాట్ (దీనిని బాబు రాజచంద్ర దాస్ ఘాట్ అని కూడా పిలుస్తారు), అహిరిటోలా ఘాట్, గంగానదిలో ప్రతిరోజూ స్నానం చేసేవారి కోసం నిమతల ఘట్టాలను నిర్మించింది. ఇంపీరియల్ లైబ్రరీకి (ప్రస్తుతం నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా), హిందూ కాలేజీకి (ప్రస్తుతం ప్రెసిడెన్సీ యూనివర్సిటీ) గణనీయమైన దాతృత్వాన్ని అందించింది.[2]
రాణి రసమణి దాస్ | |
---|---|
జననం | కోన గ్రామం, బెంగాల్ ప్రెసిడెన్సీ | 1793 సెప్టెంబరు 28
మరణం | 1861 ఫిబ్రవరి 19 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ | (వయసు 67)
జాతీయత | భారతీయులు |
ఇతర పేర్లు | రాణి రసమణి, లోకమాత |
వృత్తి | సంఘ సంస్కర్త, వ్యాపారవేత్త, జమీందారు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | దక్షిణేశ్వర్ కాళికాలయం, కోల్‌కత |
జీవిత భాగస్వామి | బాబూ రాజాచంద్ర దాస్ |
పిల్లలు | పద్మమణి దాస్, కుమారి చౌదురి, కరుణామయి బిశ్వాస్, జగదాంబ బిశ్వాస్.[1] |
ప్రస్తుతం, లోకమాతా రాణి రసమణి మిషన్, నింపిత్, దక్షిణ 24 పరగణాలు, పశ్చిమ బెంగాల్, 743338, భారతదేశంలో ఉంది.[3]
మూలాలు
మార్చు- ↑ Roy, Nirmal Kumar, "Rani Rashmonir Jibanvritanta" (Life History of Rani Rashmoni), Udbodhan, 1, Udbodhan Lane, Bagbazar, Kolkata - 700 003. ISBN 81-8040-345-9. pp. 196-232
- ↑ Rashmoni Devi Dakshineswar Kali Temple website.
- ↑ NGO's working with Environment Department Archived 31 జనవరి 2009 at the Wayback Machine Environment Department, Government of West Bengal.