రాథోడ్ జనార్దన్
రాథోడ్ జనార్దన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
రాథోడ్ జనార్దన్ | |||
[[Image:|225x|రాథోడ్ జనార్దన్]]
| |||
పదవీ కాలం 2019 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1974 జూన్ 22 భీంపూర్ గ్రామం, నార్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | చిన్యా, హీరాబాయి | ||
జీవిత భాగస్వామి | కవిత (వివాహం 1991) | ||
సంతానం | సరేందర్, నరేందర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చురాథోడ్ జనార్దన్ జూన్ 22న[2] తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలం, భీంపూర్ గ్రామంలో చిన్యా, హీరాబాయి దంపతులకు జన్మించాడు. ఆయన ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భీంపూర్‌లో తర్వాత ఆరో తరగతి నుండి ఇంటర్ వరకు ఉట్నూర్‌లో అనంతరం బీఏ పూర్తి చేశాడు.
వృత్తి జీవితం
మార్చురాథోడ్ జనార్దన్ బీఏ పూర్తి చేశాక 1990 నవంబర్ 1న డిప్యూటీ సర్వేయర్‌గా (టీజీఎంఎస్) ఉద్యోగం సాధించాడు. ఆ తరువాత డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా కుమురంభీం జిల్లాలో పని చేస్తున్న సమయంలో 2019లో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[3][4]
రాజకీయ జీవితం
మార్చురాథోడ్ జనార్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2016లో రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ బోర్డు సభ్యుడిగా నియమితుడై[5], 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఆదిలాబాద్ జడ్పీటీసీగా గెలిచి 2019 జూన్ 8న జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[6] భారత్ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి తేదీ: 3 ప్రిబ్రవరి 2024 న జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయిల్ శంకర్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాథోడ్ జనార్ధన్ హైదరాబాదులో కెటిఆర్ సమక్షంలో తిరిగి స్వంత పార్టీలో చేరారు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Namasthe Telangana (22 June 2021). "రాథోడ్ జనార్దన్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Sakshi (28 July 2019). "c". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ The Hindu (9 June 2019). "TRS sweeps Adilabad ZP polls" (in Indian English). Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Andhra Bhoomi (28 February 2017). "కవ్వాల్, అమ్రాబాద్‌లో సాయుధ నిఘా". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ HMTV (8 June 2019). "తెలంగాణాలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్/ ఛైర్మన్లుగా ఎన్నికైంది వీళ్లే." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.