రామ కృష్ణ రాయ్ ( Ram Krishna Roy) ( 1912 జనవరి 9 – 1934 అక్టోబరు 15) ఒక భారతీయ విప్లవకారుడు, బెంగాల్ వాలంటీర్లలో సభ్యుడు, అతను భారత స్వాతంత్ర్యాన్ని సాధించే ప్రయత్నంలో బ్రిటిష్ వలస అధికారులపై హత్యలు చేశాడు. మేజిస్ట్రేట్ బర్జ్ ను హత్య చేశారనే ఆరోపణపై 1934 అక్టోబరు 15న అతన్ని ఉరి తీయడం జరిగింది.

రామ కృష్ణ రాయ్
జననం9 January 1912 (1912-01-09)
Chirimarsai near Dwariband, Midnapore, British India
మరణంమూస:D-da
Medinipore Central Jail, Midnapore, British India
వృత్తిRevolutionary
Bengal Volunteers
ఉద్యమంIndian Freedom Movement

బాల్యం

మార్చు

రామ్ కృష్ణ రాయ్ ద్వారిబంద్ (పశ్చిమ్ మేదినిపూర్) సమీపంలోని చిరిమర్సాయిలో జన్మించాడు. అతని తండ్రి పేరు కెనారామ్ రాయ్, తల్లి పేరు భాబతరిణీ దేవి. అతను 1922 లో మిడ్నాపూర్ టౌన్ స్కూల్ లో మూడవ తరగతిలో చేరాడు. అతడు బ్రిటిష్ ఇండియా లో ఉన్న విప్లవాత్మక సంస్థ అయిన బెంగాల్ వాలంటీర్స్ లో చేరాడు.[1] 1926 సార్వత్రిక ఎన్నికలలో బీరేంద్రనాథ్ సస్మల్ తో కలిసి కూడా పనిచేశాడు. 1928 నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేశాడు.

విప్లవాత్మక చర్యలు

మార్చు

మిడ్నాపూర్ జిల్లా బాధ్యతలు చేపట్టడానికి ఏ బ్రిటిష్ అధికారి కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే ఇంతకూ ముందు అక్కడ మేజిస్ట్రేట్ పాడీ, రాబర్ట్ డగ్లస్ ల హత్యలు జరిగినవి.[2] ఆ సమయంలో బెర్నార్డ్ ఇ.జె.బర్గే అనే అధికారి జిల్లా మేజిస్ట్రేట్ మిడ్నాపూర్ గా నియమించడం జరిగింది. బెంగాల్ విప్లవకారుల బృందం బెంగాల్ వాలంటీర్ సభ్యులుగా ఉన్న రామకృష్ణ రాయ్, బ్రజకిషోర్ చక్రవర్తి, ప్రభాన్షు శేఖర్ పాల్, కామాఖ్య చరణ్ ఘోష్, సోనాతన్ రాయ్, నందా దులాల్ సింగ్, సుకుమార్ సేన్ గుప్తా, బిజోయ్ కృష్ణ ఘోష్, పూర్ణానంద సన్యాల్, మణింద్రనాథ్ చౌధురి, సరోజ్ రంజన్ దాస్ కనుంగో, శాంతి గోపాల్ సేన్, శైలేష్ చంద్ర ఘోష్, అనంత్ బోందు పంజా, మృగేంద్ర దత్తా మొదలైనవారు ఆయనను హతమార్చాలని ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. మిడ్నాపూర్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఫ్రాన్సిస్ బ్రాడ్లీ బ్రాడ్లీ-బిర్ట్ పేరిట జరుగుతున్న ఆటలో, బర్జ్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు అతనిని కాల్చి చంపాలని నిర్ణయించుకున్నారు. బర్జ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ సమయంలో 1933 సెప్టెంబరు 2 న వారిచే చంపబడ్డాడు.[3] మేజిస్ట్రేట్ ఆంతరంగిక రక్షక భటుడైన (బాడీ గార్డ్) అనాథబంధును చంపివేయడం జరిగింది, మృగేంద్ర దత్తా మరుసటి రోజు ఆసుపత్రిలో మరణించాడు.

మేజిస్ట్రేట్ బర్గే హత్యకు పాల్పడినందుకు 1934 అక్టోబరు 15న రామ కృష్ణ రాయ్ ను ఉరితీయడం జరిగింది.[4]

మూలాలు

మార్చు
  1. "Welcome to Midnapore.in - Bengal Volunteers of Midnapore". www.midnapore.in. Retrieved 2022-03-25.
  2. "bhavans.info". www.bhavans.info. Archived from the original on 2022-01-19. Retrieved 2022-03-25.
  3. "594 - A poignant family group: 'Wherever he served, Mr. Burge was ind..." www.spink.com. Retrieved 2022-03-25.
  4. "Abhilekh Patal". www.abhilekh-patal.in. Retrieved 2022-03-25.