రామన్ పరిమళ

భారతీయ గణిత శాస్త్రవేత్త

రామన్ పరిమళ (జ. నవంబరు 21, 1948) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆమె బీజ గణితంలో కృషి చేసింది.[1] ఆమె ఎమరీ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నది.[2] అంతకుమునుపు చాలా ఏళ్ళు టాటా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసరుగా పనిచేసింది. 2019 నుంచి గణిత శాస్త్ర విభాగంలో ఇన్‌ఫోసిస్ ప్రైజు న్యాయనిర్ణేతల్లో ఒకటిగా వ్యవహరిస్తుంది.[3] 2021-22 నుంచి ఏబెల్ ప్రైజ్ కు ఎంపిక కమిటీలో కూడా సభ్యురాలిగా పనిచేస్తుంది.[4]

రామన్ పరిమళ
జననం (1948-11-21) 1948 నవంబరు 21 (వయసు 76)
జాతిహిందూ
రంగములుబీజ గణితం
వృత్తిసంస్థలుఎమరీ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
పరిశోధనా సలహాదారుడు(లు)ఆర్. శ్రీధరన్
డాక్టొరల్ విద్యార్థులుసుజాత రామదొరై, సురేష్ వెనపల్లి
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (1987)

మూలాలు

మార్చు
  1. Riddle, Larry. "Raman Parimala". Biographies of Young Women Mathematicians. Agnes Scott College. Retrieved 2016-03-23.
  2. "Math/CS". www.mathcs.emory.edu. Archived from the original on 25 November 2018. Retrieved 2016-03-23.
  3. "Infosys Prize - Jury 2020". www.infosys-science-foundation.com. Retrieved 2020-12-10.
  4. The Abel Committee 2021/2022 Archived 19 జూన్ 2019 at the Wayback Machine The Abel prize

బాహ్య లంకెలు

మార్చు