రామయ్యగారి సుభాష్ రెడ్డి

రామయ్యగారి సుభాష్‌ రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2018 నవంబరు 2న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.

గౌ. జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి
రామయ్యగారి సుభాష్ రెడ్డి


సుప్రీం కోర్టు న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 నవంబర్ 2018 - 4 జనవరి 2022
సూచించిన వారు రంజయ్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి[1]
పదవీ కాలం
13 ఫిబ్రవరి 2016 – 1 నవంబర్ 2018
సూచించిన వారు టి.ఎస్. ఠాకూర్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
2 డిసెంబర్ 2002 – 12 ఫిబ్రవరి 2016
సూచించిన వారు గోపాల్ బల్లవ్ పట్నాయక్
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-05) 1957 జనవరి 5 (వయసు 67)
కామారం గ్రామం, చిన్న శంకరంపేట మండలం, మెదక్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆర్. సుభాష్ రెడ్డి 1957 జనవరి 5లో తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం, కామారం గ్రామంలో ఆర్ జగన్నాథ్‌ రెడ్డి, విశాలా రెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన శంకరంపేటలో పదో తరగతి పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.

వృత్తి జీవితం

మార్చు

ఆర్. సుభాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి పూర్తి చేశాక 1980 అక్టోబరు 30న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని జస్టిస్‌ బి. సుభాషణ్ రెడ్డి వద్ద జూనియర్ గా చేరాడు. ఆయన న్యాయవాదిగా సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ సంబంధమైన కేసులను వాదించాడు. ఆర్. సుభాష్ రెడ్డి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్‌కు 2001 నుండి 02 వరకు అధ్యక్షుడిగా (ఏకగ్రీవం) ఎన్నికై పనిచేశాడు.జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి 2002 డిసెంబరు 02న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.


ఆయన తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసు అథార్టీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌‌గా పనిచేసి, ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా 2002 డిసెంబరు 2 నుండి 2016 ఫిబ్రవరి 12 వరకు పనిచేసి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు.[2] ఆయన అక్కడ 2016 ఫిబ్రవరి 13 నుండి 2018 నవంబరు 1 వరకు పనిచేసి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2018 నవంబరు 2న నియమితుడయ్యాడు.[3]

జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి 2019 డిసెంబరు 17న దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడిగా[4]శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మహిళల పట్ల వివక్ష వద్దంటూ దాఖలైన పిటీషన్లపై రోజువారీ విచారణ కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Honourable the Chief Justice". Gujarat high court. Retrieved 2 November 2018.
  2. Sakshi (14 February 2016). "గుజరాత్ సీజేగా జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  3. Sakshi (3 November 2018). "సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి ప్రమాణం". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  4. Sakshi (17 December 2019). "రేప్‌ కేసుల విచారణ తీరుపై 'సుప్రీం' కమిటీ". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  5. Telugu (7 January 2020). "శబరిమల కేసు విచారించేది ఈ జడ్జీలే". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.