రామరాజు రంగప్పరాజు
రామరాజు రంగప్పరాజు క్షత్రియకవి. ఇతడు యపస్తంబసూత్రుడు, ఆత్రేయ గోత్రుడు, తిరుమల శ్రీనివాసాచార్య శిష్యుడు. సాంబోపాఖ్యాన మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగనాయకున కంకితము చేసెను. ఈ కవి కృష్ణదేవరాయని యల్లుడైన రామరాయలకు బెదతండ్రి కొడుకు. కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై యుండినవాడు. కాబట్టి కవి 1550 వ సంవత్సర ప్రాంతము లందుండినవాడని నిశ్చయముగా జెప్పవచ్చును.
కోనేటి తిమ్మరాజునకును రామరాజునకును తాత యగు ఆరవీటి రామరాజును, రామరాయలను, కవి తన సాంబోపాఖ్యానమునం దిట్లు వర్ణించియున్నాడు:
- ఉ. పోరుల నారువీటిపురబుక్కయరామనృపాలు డాగ్రహో
- దారత వాలు పూనిన సదాగతికంపితజీర్ణ వర్ణ లీ
- లారభటిన్ విరోధిమహిళాంగవిభూషణరాజీరాలు దై
- వారు బ్రతాపవల్లవశుభప్రభ వర్ధిలు గీర్తిపుష్పముల్
- మ. దివిజేంద్రాభుడు కృష్ణరాయధరణీదేవేంద్రుజామాత శ్రీ
- ధవపాదాంబుజబంభరం బమరు మేధా వేధ రామప్ప శా
- త్రవకంఠాంతరరక్తశీకరసమిద్ధారోర్మినిర్ధౌతఖ
- డ్గవనీకీర్తిలతాంతగంధిలహరిత్కాంతాకచాభోగు డై
కవిత్వ ధోరణి
మార్చుఈతనిది సలక్షణమై నిరర్గళధార గల ఛందోబద్ధ కవిత్వము. కవనరీతి తెలియుట కయి సాంబోపాఖ్యానములోని పద్యముల గొన్నిటి నిం దుదాహరించ బడినవి.
- చ. పరమజ్ఞానిహృదంతరాళమణిదీపంబుల్ నమస్నాగకి
- న్నరనక్తంచరనాక నాయకశిరోనాళీకరాగప్రభాం
- కురనీరాజితముల్ నిజాంఘ్రితలముల్ గోపాలబాలుండు ని
- ల్పె రటద్గోఖుర ధూలీ ధోరణుల నాబృందావనక్వ్ క్షీనులన్
- ఉ. వల్లవవల్లభుండు చెలువల్జలమాడగ దత్కటీతటీ
- పల్లవముల్ హరించి తను బ్రార్థనచేసిన నీక నవ్వు నా
పల్ల తికాలవిత్రమయి పాండవపత్నికి నెట్టు లిచ్చెనో
- చుల్లర వెట్టుప్రల్ల దపుజూదరి సిగ్గుపడం బటావళిన్. [ఆ.1]
- శా. అనియమంబు నాయమము నాథమ మాశమ మానిరంతర
- ధ్యానవిధాన మాబహువిధానబంధవిదగ్ధభావ మా
- మానస మెందునున్ జననిమట్టును గుట్టును మౌను లౌననం
- గా నత డొప్పు భక్తికలికాకిలికించితబోధమాధురిన్. [ఆ.2] [ 148 ]
- ఉ. సడి గాకుండగ నుగ్రసేననృపు భిక్షావృత్తి బట్టంబునం
- దిడి కంసార్జితరత్నకోటులు మహాహేమంబు లాందోళికల్
- పడుతు ల్పర్వతసన్నిభేభములు ఝంపాసంపతద్వాహముల్
- నడపించెం దనయింటికీ వెఱుగవే నారాయణుం డుద్ధవా. [ఆ.2]
- చ. కళలు భజింప వచ్చు శశికాంతివిధంబున నేగు దెంచె నా
- యెలు గుల ఱేనియాజ్ఞ గమలేక్షణుసన్నిధికిన్ సఖీజనా
- వళి భజియింప జాంబవతి వజ్రమయాభరణౌఘశింజితం
- బులు పదవమ్మ నీ వనుచు బుజ్జవ మారంగ బల్కునట్లుగన్. [ఆ.7]
- ఉ. భోజనపాత్ర మొక్కటి యపూర్వము పర్వతధారి కిచ్చెనం
- భోజభవప్రసూతి యది భోజనవేళ దలంచుభోజ్యముల్
- యోజనసేయజాలు నది యోజనమాత్రవిసారి కాంతివి
- భ్రాజితగారుడాశ్మవిసరస్థగితంబు విషాపహారియున్. [ఆ.3]
- మ. అమృతస్యందము కందళింప దరహాసాంకూరముల్ లోచనా
- గ్రములం దాండవ మాడ జంద్రధరు డాకంజాక్షు నీక్షించి యో
- కమలాక్షా పరురీతి నీవు వ్రతదీక్షన్ రూక్షచర్యాసము
- ద్వమముం జూపుదు వయ్య యెయ్యడ సుహృద్భావంబె యీ చందముల్. [ఆ.4]
- చ. కమలసహస్రము న్నయనకాంతి యొనర్పగ ఫాలబింబముల్
- గుముదహితా యుతంబు నొడగూర్పు బెనంగు మృగాక్షిమోముతో
- గమలము జంద్రు బోల్చుకవిగాథల కెయ్యదిమేర యుత్తమో
- త్తము నధము న్సమాన మన దారదె బుద్ధి యవజ్ఞం చేరదే. [ఆ.4]
- చ. అనుచుం బెగ్గిలి కుందునంగనల నయ్యబ్జాక్షి వీక్షించి యో
- యనుగున్నె చ్చెలులార మీరలు సరోజాలి న్మనోజాతు గ్రొ
- న్ననలం జిల్కల గోకిలప్రతతి నింద ల్సేయగా నేల నా
- తనువే నిత్యము ప్రాణ మేమి ధ్రువమే తర్కింపుడీ యీదెసన్. [ఆ.5]
మూలాల జాబితా
మార్చుఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు .రామరాజు రంగప్పరాజు (విభాగం)