రామసేతు

రామేశ్వరం (పంబన్) ద్వీపానికి, శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ (Mannar) ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్

రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం (పంబన్) ద్వీపానికి, శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ (Mannar) ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి [1]. ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక, సున్నపు రాళ్ళను కలిగియుంటుంది. హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగియుండే ఈ ఇసుక దిబ్బ పొడవు 18 మైళ్ళు (అనగా 30 కిలోమీటర్లు).[ఆధారం చూపాలి]1788 సం, ఆసమయం లో ఆస్ట్రేలియాకు చెందిన బోటనికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణ ల ఆధారంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయార్ జనరల్ జేమ్స్ రెనలే ఒక మ్యాప్ గీశాడు దీనిని మ్యాప్ ఆఫ్ హిందుస్తాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవాళ్ళు.

గాల్లోంచి పశ్చిమ దిశగా చూసినపుడు రామసేతు

మత విశ్వాసాలు

మార్చు

కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేసాడు. ఈ వారధిని పలురకాల చెట్ల కాండాలతోను, రాళ్ళతోను నిర్మించారు. ఆ విధంగా వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందువుల నమ్మకం.

వాదనలు

మార్చు
 
రామసేతు నాసా చిత్రం

యుద్ధకాండ 22:66-70 ప్రకారం వానరులు మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాల్గవ రోజు 22 యోజనాలు, ఐదవరోజు 23 యోజనాలు - మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టువరకూ నిర్మించి చివరకు లంక ఒడ్డుకు చేరారు.. అనగా 5 రోజుల్లో నిర్మించిన రామ సేతువంతెన పొడవు 14+20+21+ 22+23 = 100 యోజనాలు . యోజనము అనగా 3 మైళ్ళు. అనగా ఐదు రోజుల్లో 100x3= 300 మైళ్ళు నిర్మించడం జరిగింది ; మైలు అనగా 1.6 కిలో మీటర్లు, అనగా వానరులు 5 రోజుల్లో 300x1.6=480 కిలోమీటర్ల వంతెన కట్టడం అతిశయోక్తి అని, రామసేతు అసలైన పొడవు కేవలం 30 కిలోమీటర్లు [2] అయితే 480 కిలోమీటర్లు ఎలా సాధ్యం అయ్యిందని, అసలు 5 రోజుల్లో కనీసం 30 కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించడం అసంభవమని వాదించేవారు లేకపోలేదు.

లంక అంటే సముద్ర తీర ప్రాంతము లేక చిన్న ద్వీపము. రామాయణం ప్రకారం లంకా ద్వీపం భారత దేశానికి 480 కిలోమీటర్లు (100 యోజనాలు) దూరంలో ఉంది. కాని నేటి వాస్తవాన్ని పరిశీలిస్తే భారతదేశం నుండి శ్రీలంక దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. భూమి పై మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగి రెండు ప్రదేశాల మధ్య దూరం పెరుగుతుందే గాని తగ్గదు. కనుక రామయణంలో పేర్కొనబడిన లంక అనగా వాస్తవంగా శ్రీలంక అని అనుకోవక్కర్లేదని వాదించేవారు లేకపోలేదు.

ఐతే రామాయణం జరిగి దాదాపు 869,000 ల యేళ్ళు గడిచింది కనుక (కలియుగం దాదాపు 5000 ల యేళ్ళు, ద్వాపర యుగం 864,000 యేళ్ళు) ఇప్పటి భూభాగానికీ, అప్పటి భూభాగానికీ తేడాలు రావడం అంత పెద్ద విషయమేమీ కాదన్నది మరి కొందరి వాదన.

మూలాలు

  1. "Adam's bridge". Encyclopædia Britannica. 2007. Archived from the original on 12 October 2007
  2. Length taken from Google Earth

చూడవలసిన లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రామసేతు&oldid=4135917" నుండి వెలికితీశారు