రామాఫలం

(రామ ఫలం నుండి దారిమార్పు చెందింది)
రామాఫలం
రామాఫలం
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
ఏ. రెటిక్యులేటా
Binomial name
అనోనా రెటిక్యులేటా
Native range of A. reticulata
Synonyms

Annona humboldtiana Kunth
Annona humboldtii Dunal[1]
Annona excelsa Kunth
Annona laevis Kunth
Annona longifolia Sessé & Moc.
Annona riparia Kunth
Rollinia mucosa (Jacq.) Baill.[2]
Rollinia deliciosa Saff.
Annona mucosa Jacq.
Rollinia orthopetala A. DC.
Rollinia pulchrinervia A. DC.
Rollinia sieberi A. DC. [3]

రామాఫలం (Annona reticulata) అనోనేసి కుటుంబానికి చెందిన సీతాఫలం లాంటి ఒక పండ్ల చెట్టు.

రామాఫలము ఇది సీతాఫల జాతికి చెందిన పండు. పోషకవిలువలు ఎక్కువగా వున్న పండు. లేత ఎరుగు రంగులోను, ఆకు పచ్చ రంగులోని ఈ పండ్లు వుండును.దస్త్రం

రామా ఫలము. వెంకట్రామా పురంలో తీసిన చిత్రం

కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి. రామాఫలం : గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది ఈ జ్యూస్‌. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే. పోషకాలు: వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది.

మూలాలు

మార్చు
  1. Germplasm Resources Information Network (GRIN) (1997-07-11). "Taxon: Annona reticulata L." (HTML). Taxonomy for Plants. USDA, ARS, National Genetic Resources Program, National Germplasm Resources Laboratory, Beltsville, Maryland. Retrieved 2008-04-16.
  2. Missouri Botanical Garden (1753). "Annona reticulata L." Tropicos. Archived from the original (HTML) on 2008-10-14. Retrieved 2008-04-16.
  3. Germplasm Resources Information Network (GRIN) (2000-12-15). "Taxon: Rollinia mucosa (Jacq.) Baill". Taxonomy for Plants. USDA, ARS, National Genetic Resources Program, National Germplasm Resources Laboratory, Beltsville, Maryland. Archived from the original (HTML) on 2009-09-01. Retrieved 2008-04-16.
 
రామఫల చెట్టు
"https://te.wikipedia.org/w/index.php?title=రామాఫలం&oldid=4173610" నుండి వెలికితీశారు