రాయగడ
రాయగడ ఒడిషా రాష్ట్రం, రాయగడ జిల్లా లోని పట్టణం. ఇది రాయగడ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
రాయగడ | |
---|---|
పట్టణం | |
Coordinates: 19°10′N 83°25′E / 19.17°N 83.42°E | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
District | రాయగడ |
Founded by | విశ్వనాథ దేవ గజపతి |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | రాయగడ పురపాలక సంఘం |
Elevation | 207 మీ (679 అ.) |
జనాభా (2011) | |
• Total | 71,308 |
భాషలు | |
• అధికారిక | Odia, Telugu |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 765001 |
Telephone code | 06856 |
Vehicle registration | OD-18 |
Website | https://myrayagada.com |
చరిత్ర
మార్చురాయగడ నగరాన్ని సూర్యవంశ రాజవంశానికి చెందిన నందపూర్ రాజ్య పాలకుడు విశ్వనాథ దేవ గజపతి (సా.శ. 1527-1531) స్థాపించాడు. ఇది ఉత్తరాన బెంగాల్ నుండి దక్షిణాన తెలంగాణ వరకు విస్తరించి ఉన్న విస్తృతమైన రాజ్యానికి రాజధానిగా ఉండేది. దేశంలోని తీర ప్రాంతాలలో వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా ఉండేది. రాజు నిర్మించిన కోట, నాగావళి నది వెంబడి నిర్మించబడిన పుణ్యక్షేత్రాలు కూడా పట్టణాంలో ఉన్నాయి. పట్టణంలో క్షేత్ర రక్షక దేవతగా పరిగణించే మాజిఘరియాని దేవాలయం కూడా ఉంది. 1947 వరకు, ఈ నగరం జైపూర్ మహారాజుల ఏలుబడిలో ఉండేది. [1]
జనాభా
మార్చు2001 భారత జనగణన ప్రకారం [2] రాయగడ జనాభా 57,732. జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49% ఉన్నారు. జనాభాలో 12% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయగడ పట్టణ జనాభా 71,208, ఇందులో పురుషుల జనాభా 36,036, స్త్రీల జనాభా 35,172. రాయగడ సగటు అక్షరాస్యత రేటు 64%. ఇది జాతీయ సగటు 74.4% కంటే తక్కువ. పురుషులలో అక్షరాస్యత 72% కాగా, స్త్రీల అక్షరాస్యత 56%[3]
దేవాలయాలు
మార్చుమా సంతోషి ఆలయం, రాయగడ, రోజువారీ మార్కెట్ సమీపంలో ఉంది.
ప్రముఖ వ్యక్తులు
మార్చు- వరుణ్ సందేశ్, తెలుగు సినిమా నటుడు
మూలాలు
మార్చు- KSB Singh (1939). Nandapur A Forsaken Kingdom. Utkal Sahitya Press. ISBN 978-81-86772-17-1.
- ↑ KSB Singh 1939, p. 16.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Population of Rayagada". Census of India. Retrieved 16 June 2015.