రాయికల్ దామోదర్ రెడ్డి

రాయికల్‌ దామోదర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1962లో షాద్‌నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాయికల్ దామోదర్ రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1962 - 1967
ముందు షాజహాన్ బేగం
తరువాత కె.నాగన్న
నియోజకవర్గం షాద్‌నగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1921
రాయికల్ గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2016 డిసెంబర్ 26
హైదరాబాద్
విశ్రాంతి స్థలం రాయికల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం హైదరాబాద్

రాజకీయ జీవితం

మార్చు

దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1955 నుంచి 1958 వరకు కొందుర్గు పంచాయతీ సమితి అధ్యక్షులుగా,1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆ తరువాత 1970లో షాద్‌నగర్ పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1981 నుంచి పదేళ్లపాటు రాయికల్ గ్రామ సర్పంచ్‌గా, ఆ తర్వాత షాద్‌నగర్ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశాడు.

దామోదర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి 2016 డిసెంబర్ 26న మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. Sakshi (26 December 2016). "మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.