రాయిమతి ఘియురియా
రాయిమతి ఘియురియా ఒడిశా, కోరాపుట్ జిల్లాకు చెందిన ఒక గిరిజన రైతు. ఆమె ను చిరుధాన్యాల మహారాణి (Millet Monarch) అని పిలుస్తారు. ఆమె 70 దేశవాళీ ధాన్యం రకాలను 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తోంది. వీటిలో కుంద్రాబాటి మందియ, జస్రా, జువానా, జంకోలీ వాటి అరుదైన రకాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాల పరిరక్షణలో ఆమెకు పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన కమలా పూజారియే స్ఫూర్తి. కమల సూచన మేరకు రాయిమతి చెన్నై కేంద్రంగా పని చేసే ఎం.ఎస్.స్వామినాధన్ పరిశోధనా సంస్థ (MSSRF) లో చేరి విత్తనాల సేకరణ, భద్రపరచడం, సంరక్షణ ఇంకా గ్రామీణ మహిళల ఉపాధి వంటి అంశాలు, ఆధునిక పద్ధతులు అవగాహన పొంది మరో 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది.[1]
2000 నుండి, ఫౌండేషన్ శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో రాయిమతికి మద్దతునిస్తోంది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR – IISWC) నుండి ఉత్తమ వ్యవసాయ దారులు పురస్కారం (బెస్ట్ ఫార్మర్ అవార్డ్) లభించింది, TATA స్టీల్ వారి సౌజన్యంతో నిర్వహింపబడిన సాంప్రదాయ ఆహార ఉత్సవం (ట్రెడిషనల్ ఫుడ్ ఫెస్టివల్) లో గుర్తింపు వంటి ప్రశంసలు పొందడం ద్వారా ఆమె చేసిన కృషికి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో గుర్తింపు లభించింది.[2] [1]
ఆమె మహిళా రైతుల సహకార సంఘాన్ని నడుపుతూంది. తన వ్యవసాయ పనులకు అతీతంగా చిరుధాన్యాల పిండి వంటలు తయారు చేసి స్థానిక దుకాణాలలో, కుంద్రాలోని టిఫిన్ సెంటర్‌లలో విక్రయిస్తోంది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడింది. తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో కొంత భాగాన్ని వ్యవసాయ పాఠశాలకు దానం ఇచ్చింది. 2023 లో జరిగిన జీ 20 సదస్సులో సాంప్రదాయ వడ్లు, చిరుధాన్యాల రకాలను ప్రదర్శించే అవకాశం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, అంతర్జాతీయ నాయకుల గుర్తింపు లభించాయి. [1] [2]
వీడియో లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "చిరుధాన్యాల మహారాణి". నమస్తే తెలంగాణా, బతుకమ్మ, ఆదివారం. 25 February 2024.
- ↑ 2.0 2.1 "Raimati Ghiuria: Meet the woman from Odisha's Koraput who is called as the Queen of Millets". The Economic Times News. 23 December 2023. Retrieved 23 February 2024.
- ↑ "They Call Me 'Queen of Millets'". The Better India. 27 January 2024. Retrieved 1 March 2024.
- ↑ "Farmers' Day: Meet Odisha's Raimati Ghiuria Who Has Grown & Preserved 30 Types Of Rare Millets". OTV News English. 23 December 2023. Retrieved 1 March 2024.