రిచర్డ్ అటెన్‌బరో
రిచర్డ్ అటెన్‌బరో ఒక హాలీవుడ్ దర్శకుడు.
రిచర్డ్ అటెన్‌బరో | |
---|---|
జననం | కేంబ్రిడ్జి, ఇంగ్లండ్ | 1923 ఆగస్టు 29
మరణం | 2014 ఆగస్టు 24 లండన్, ఇంగ్లండ్ | (వయసు 90)
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1942–2007 |
బిరుదు | అధ్యక్షుడు బ్రిటీస్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ అండ్ ఫిల్ం అవార్డ్స్ |
పదవీ కాలం | 2001–2010 |
జీవిత భాగస్వామి | షీలా సిమ్ (1945–2014; మరణం వరకు) |
పిల్లలు | 3 (మైకేల్ అటెన్‌బరో తో కలిపి) |
బంధువులు | డేవిడ్ అటెన్‌బరో (సోదరుడు) జాన్ అటెన్‌బరో (సోదరుడు) గెరాల్డ్ సిమ్ (బావ మరిది) జేన్ సీమోర్ (మాజీ కోడలు) |
నేపధ్యము
మార్చురిచర్డ్ 1923 ఆగస్టు 29న లండన్‌లో జన్మించారు. హాలీవుడ్‌లో నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తెల్లని గడ్డం, జట్టుతో ఆయన సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేశారు. దీంతో ఆయన 'డికీ' అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. 'ఓ వాట్ ఎ లవ్లీ వార్', 'చాప్లిన్', 'షాడో లాండ్స్' తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'గాంధీ' చిత్రం ఆస్కార్ అవార్డుల పంట పండించింది. ఎనిమిది విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఆయన నటించిన 'జురాసిక్ పార్క్', 'మిరాకిల్ ఆన్ 34 స్ట్రీట్' చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2002లో 'పకూన్' చిత్రంలో రిచర్డ్ చివరిసారిగా కనిపించగా, ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం 'క్లోసింగ్ ద రింగ్'.
మరణము
మార్చుకొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రిచర్డ్ 2014 ఆగస్టు 25న తుది శ్వాస విడిచారని ఆయన కుమారుడు మైకెల్ అటెన్‌బరో తెలిపారు.రిచర్డ్ మృతిపై ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సంతాపం వ్యక్తం చేశారు. 'బ్రైటన్ రాక్' చిత్రంలో ఆయన నటన అద్భుతమని, 'గాంధీ' చిత్రం ఓ గొప్ప చిత్రమని కితాబిచ్చారు. రిచర్డ్ మృతి హాలీవుడ్‌కి తీరని లోటని ఈ సందర్భంగా కామెరూన్ అన్నారు.
బయటి లంకెలు
మార్చు- Richard Attenborough Archive Archived 2014-08-28 at the Wayback Machine on the British Academy of Film and Television Arts (BAFTA) site
- University of Sussex media release about Lord Attenborough's election as Chancellor, dated Friday, 20 March 1998
- Richard Attenborough Stills & Posters Gallery from the British Film Institute
- Richard Attenborough Centre for Disability and the Arts
- Richard Attenborough in Leicester website
- Works by or about రిచర్డ్ అటెన్‌బరో in libraries (WorldCat catalog)
- Richard Attenborough at Virtual History
- Richard Attenborough Fellowship – Muscular Dystrophy Campaign
- Richard Attenborough's appearance on This Is Your Life