రితు పాతక్ ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయిని. మధ్యప్రదేశ్ లోని గోపాల్ గంజ్ లో జన్మించిన ఈమె, ఇండియన్ ఐడెల్ సీజన్ 2లో పాల్గొన్న తరువాత దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. మరో టీవీ మ్యూజిక్ షో ఫేం ఎక్స్ లో కూడా ఆమె ఫైనలిస్టుగా నిలిచింది. శంకర్-ఎహ్సాన్-లోయ్ం సాజిద్-వాజిద్, ఆనంద్ రాజ్ ఆనంద్ వంటి  ప్రముఖ సంగీత దర్శకుల చేసిన ఎన్నో పాటలను పాడింది రితు.

రితు పాతక్
జన్మ నామంరితు పాతక్
జననం (1987-09-04) 1987 సెప్టెంబరు 4 (వయసు 36) [1]
సియోనీ, మధ్యప్రదేశ్, భారతదేశం
మూలంసియోనీ, మధ్యప్రదేశ్
సంగీత శైలిహిందుస్తానీ సంగీతం, పాప్ మ్యూజిక్, సినిమా సంగీతం.
వృత్తినేపధ్య గాయని
క్రియాశీల కాలం2010–ప్రస్తుతం

తొలినాళ్ళ జీవితం మార్చు

మధ్యప్రదేశ్ లోని గోపాల్ గంజ్ లో జన్మించింది రితు. ఆమె తండ్రి కూడా గాయకుడే. స్థానిక ఆర్కెస్ట్రా షోలలోనూ, చిన్న చిన్న సంగీత సభల్లో పాడేవాడు ఆమె తండ్రి. ఆమె తండ్రి ప్రోత్సాహంతోనే రితు సంగీతంలో అభిలాష పెంచుకుంది. రితు తండ్రి ఆమెను వివిధ రియాలిటీ సంగీత షోలలో పాల్గొనేలా ప్రోత్సహించేవాడు.[2]నాగపూర్ లో మొదట సంగీతంలో శిక్షణ తీసుకుంది ఆమె.[3] ఆ తరువాత సంగీత మహాభారతిలో హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది రితు.[4]

మూలాలు మార్చు

  1. "RITU PATHAK". prideyou. Archived from the original on 12 ఫిబ్రవరి 2016. Retrieved 23 October 2015.
  2. "Singing was my father's dream: Ritu Pathak". Retrieved 30 November 2013.
  3. "Ritu Pathak on Radha Nachegi: Sonakshi's expressions and moves add to the chutzpah of the song". Retrieved 19 December 2014.
  4. "Ritu Pathak Live Show". Retrieved 24 October 2015.