రిమోట్ కంట్రోల్
రిమోట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నియంత్రించుటకు వాడు సాధనము.టీవీలు, టేప్‌రికార్డర్లు, సీడీ ప్లేయర్లను మాత్రమే కాకుండా, కారు డోర్లను కూడా మనం కూర్చున్న చోట్లనుంచే కదలకుండా పని చేయించకలిగే సాధనమే 'రిమోట్ కంట్రోల్'. ఈ సాధనంలో వివిధ పనులు చేయడానికి కొన్ని మీటలు ఉంటాయి. ఆ మీట నొక్కగానే అది చేయవలసిన పని పరారుణ కిరణాలుగా సంకేత రూపంలోకి మారుతుంది. ఆ కిరణాలు టీవీకి అమర్చిన మీటలు అందుకుంటాయి. అప్పుడు ఆ మీట పనిచేసి మనం అనుకున్న మార్పులు జరుగుతాయి.
నిర్మాణము
మార్చురిమోట్ కంట్రోల్ లోపల వెనుక భాగంలో ఒక విద్యుత్ వలయం, పలక (ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు), బ్యాటరీ కనెక్షన్ ఉంటాయి. అక్కడ ఒక సమగ్రమైన వలయం (సర్క్యూట్) ఉంటుంది. దీనిని చిప్ అంటారు. చిప్‌కు కుడివైపున నలుపు రంగులో డయోడ్ (ట్రాన్సిస్టర్) ఉంటుంది. పసుపు రంగులో రెజోనేటర్, ఆకుపచ్చ రంగులో రెండు విద్యుత్ నిరోధకాలు', ముదురు నీలం రంగులో కెపాసిటర్ ఉంటాయి. బ్యాటరీలకు కలిపి ఆకుపచ్చరంగులో ఒక విద్యుత్ నిరోధకం, బ్రౌన్ రంగులో ఒక కెపాసిటర్ కూడా ఉంటాయి.
పని తీరు
మార్చురిమోట్ కంట్రోల్ మీట ను మనం నొక్కగానే ఆ విషయాన్ని 'చిప్' కనిపెడుతుంది. వెంటనే మనం నొక్కిన మీట ఏం కావాలనుకుంటుందో ఆ సూచనను మోర్స్‌కోడ్‌లాంటి సంకేతాలుగా మారుస్తుంది. ఒక్కొక్క మీటకు వేర్వేరు సంకేతాలుంటాయి. చిప్ ఆ సంకేతాలను ట్రాన్సిస్టర్‌కు పంపిస్తుంది. ట్రాన్సిస్టర్ ఆ సంకేతాలను అర్థం చేసుకుని విడమరిచి దృఢ పరుస్తుంది. ఈ సంకేతాలు టెలివిజన్ ఎదురుగా ఉండే రిమోట్ కంట్రోల్ చివరిభాగంలో ఉండే ఒక చిన్న బల్బు రూపంలో ఉన్న 'లైట్ ఎమిటింగ్ డయోడ్'ను చేరుకుంటాయి.
ఈ డయోడ్ సంకేతాలను పరారుణ కాంతికిరణాలుగా మారుస్తుంది. ఈ కిరణాలు మన కంటికి కనబడవు. కానీ టెలివిజన్లో ఉండే గ్రాహకం వీటిని గ్రహిస్తుంది. ఈ కిరణాలు తెచ్చిన సంకేతాలను టెలివిజన్ వలయానికి అందిస్తుంది. సంకేతాలకు అనుగుణంగా టెలివిజన్ వలయం మార్పుచెంది మనం రిమోట్ కంట్రోల్‌తో చేయాలనుకున్న మార్పు టెలివిజన్ లో కనిపిస్తుంది.
బయటి లంకెలు
మార్చు- Description of infrared remote protocols Archived 2008-08-07 at the Wayback Machine
- Infra-red Remote Control Theory Archived 2011-10-22 at the Wayback Machine
- New Remote's History of the Remote Control
- The Philco Mystery Control in Action
- IR Handset Technical Descriptions
- Wireless Garage Door Opener Operated From a Remote Control
- Where the Future of the Remote is Likely Headed
- Recycled remote control replacement information Archived 2019-04-17 at the Wayback Machine
- IR Protocol Analyzer application using photo-transistor on microphone input