రియాజ్ అఫ్రిది

పాకిస్తానీ క్రికెట్ కోచ్, క్రికెటర్

రియాజ్ అఫ్రిది (జననం 21 జనవరి 1985) పాకిస్తానీ క్రికెట్ కోచ్, క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[2]

రియాజ్ అఫ్రిది
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1985-01-21) 1985 జనవరి 21 (వయసు 39)
పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
బంధువులుషాహీన్ అఫ్రిది (సోదరుడు)
యాసిర్ అఫ్రిది (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 182)2004 అక్టోబరు 28 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 42
చేసిన పరుగులు 9 580
బ్యాటింగు సగటు 9.00 13.18
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 9 66
వేసిన బంతులు 186 7902
వికెట్లు 2 182
బౌలింగు సగటు 43.50 23.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 2/42 7/78
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/–
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 11

కుటుంబం

మార్చు

2017 డిసెంబరులో ఇతని తమ్ముడు షాహీన్ ఆఫ్రిది 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[3]

క్రికెట్ రంగం

మార్చు

అఫ్రిది శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుతో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[4]

రియాజ్ పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఆటగాడు యాసిర్ అఫ్రిది బంధువు. 2007లో రియాజ్ ఇండియన్ క్రికెట్ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లాహోర్ బాద్‌షాస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వేసవి నెలల్లో రియాజ్ ఈశాన్య ఇంగ్లాండ్‌లోని ఒక లీగ్‌లో గ్రేట్ ఐటన్ సీసీ కోసం ఆడి, లీగ్‌ను గెలవడంలో కృషి చేశాడు. ఇతని ఫాస్ట్ స్వింగ్ బౌలింగ్, బిగ్ హిట్టింగ్‌తో లీగ్‌లో నిలకడగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ లిమిటెడ్ క్రికెట్ జట్టు తరపున క్రికెట్ ఆడాడు. ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ చీతాస్ కు కెప్టెన్ గా ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. "Riaz Afridi Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-13.
  2. "Riaz Afridi". CricketArchive. Retrieved 2023-09-13.
  3. "Hasan Khan to lead Pakistan Under-19s at World Cup". ESPN Cricinfo. Retrieved 2023-09-13.
  4. "Riaz Afridi - Pakistan". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-09-13.