రియాజ్ హసన్
రియాజ్ హసన్ (జననం 2002 నవంబరు 7) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2022 జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ పోటీల్లో అడుగు పెట్టాడు. [1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | నంగర్‌హార్, ఆఫ్ఘనిస్తాన్ | 2002 నవంబరు 7
బ్యాటింగు | కుడిచేతి వాటం |
పాత్ర | బ్యాటరు |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి వన్‌డే (క్యాప్ 54) | 2022 జనవరి 25 - నెదర్లాండ్స్ తో |
చివరి వన్‌డే | 2023 ఆగస్టు 26 - పాకిస్తాన్ తో |
మూలం: Cricinfo, 28 February 2022 |
అతను 2018 ఏప్రిల్ 8న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో అమో రీజియన్ కోసం ఫస్ట్-క్లాస్ లో ప్రవేశించాడు.[2] 2018 జూలై 18న 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో అమో రీజియన్‌కు తన తొలి లిస్ట్ A మ్యాచ్ ఆడాడు [3] 2020 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో కాబుల్ ఈగల్స్ తరపున 2020 సెప్టెంబర్ 8 న ట్వంటీ20ల్లో రంగప్రవేశం చేసాడు. [4]
అంతర్జాతీయ కెరీర్
మార్చుజనవరి 2022లో, అతను ఖతార్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టుకు ఎంపికయ్యాడు. [5] 2022 జనవరి 25 న ఆఫ్ఘనిస్తాన్ తరపున నెదర్లాండ్స్‌పై తన తొలి వన్‌డే ఆడాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Riaz Hussan". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
- ↑ "19th Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Amanullah, Apr 8-11 2018". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
- ↑ "Ghazi Amanullah Khan Regional One Day Tournament at Kabul, Jul 18 2018". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
- ↑ "4th Match, Kabul, Sep 8 2020, Shpageeza Cricket League". ESPN Cricinfo. Retrieved 8 September 2020.
- ↑ "Nabi rules himself out of Netherlands ODIs". CricBuzz. Retrieved 15 January 2022.
- ↑ "3rd ODI, Doha, Jan 25 2022, ICC Men's Cricket World Cup Super League". ESPN Cricinfo. Retrieved 25 January 2022.