రియా శుక్లా
2020లో రియా శుక్లా
జననం
రియా శుక్లా

(2000-01-01) 2000 జనవరి 1 (వయసు 24)
వృత్తినటి
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాటి పింకీ కి లంబీ లవ్ స్టోరీ

రియా శుక్లా ఒక భారతీయ నటి. ఆమె నిల్ బట్టే సన్నాటతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది, ఆమెకు స్టార్ స్క్రీన్ అవార్డ్స్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది.[1] జీ సినీ అవార్డ్‌లో ఉత్తమ మహిళా అరంగేట్రానికి కూడా ఎంపికైంది.[2] 2020లో, ఆమె కలర్స్ టీవీ నాటి పింకీ కి లంబీ లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర లావణ్య "పింకీ" కశ్యప్/భరద్వాజ్‌గా కనిపించింది.[3]

ప్రారంభ జీవితం

మార్చు

రియా శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1998 జనవరి 1న జన్మించింది.[4] లక్నోలోని ఎంకెఎస్డీ ఇంటర్ కాలేజ్ నుండి తన విద్యను పూర్తి చేసింది.

కెరీర్

మార్చు

రియా రియాలిటీ టీవీ షో హిందుస్థాన్ కే హునర్బాజ్ తో పోటీదారుగా వినోద ప్రపంచంలోకి ప్రవేశించింది.[4]

2015లో నిల్ బట్టే సన్నతతో అప్పుగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ పాత్ర కోసం ఆమె స్టార్ స్క్రీన్ అవార్డ్‌లో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గెలుచుకుంది.[4] ఆమె హిచ్కీ, థర్డ్ ఐ చిత్రాలలో కూడా కనిపించింది.[4]

2020 నుండి, నాటి పింకీ కి లాంబి లవ్ స్టోరీలో లావణ్య "పింకీ కశ్యప్/భరద్వాజ్" ప్రధాన పాత్ర పోషించింది. ఆమె నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ రాత్ అకేలీ హైలో కూడా చున్నీగా కనిపించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం షో పాత్ర ఛానెల్ గమనిక
2020 నాటి పింకీ కి లంబీ లవ్ స్టోరీ లావణ్య కశ్యప్ కలర్స్ టీవీ ప్రధాన పాత్ర

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా గమనిక
2015 నిల్ బట్టే సన్నాట స్టార్ స్క్రీన్ అవార్డ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్
2017 బట్టర్ ఫ్లైస్ అండ్ హరికేన్స్ షార్ట్ ఫిల్మ్
2018 హిచ్కి
2019 థర్డ్ ఐ [5]
2020 రాత్ అకేలీ హై చున్నీ [6]

మూలాలు

మార్చు
  1. Ghosh, Suktara (5 December 2016). "Star Screen Awards 2016 Winners:A big night for Pink and Alia bhatt". The quint. Retrieved 1 October 2020.
  2. "Zee Cine Awards Winners and Nominations". Zeecineawards.com. Retrieved 1 October 2020.
  3. Wadhwa, Akash (16 July 2020). "We are actually learning to treat the abnormal around us normal:Riya Shukla". Times of India. Retrieved 30 September 2020.
  4. 4.0 4.1 4.2 4.3 Wadhwa, Akash (19 March 2020). "I am not dwarf, nor do I play the one in Naati Pinky Ki Lambi Love Story: Lucknow girl Riya Shukla". Times Of India. Retrieved 30 September 2020.
  5. "3rd Eye Movie". Times of India. Retrieved 30 September 2020.
  6. "Patriarchy a living character in society:Raat Akeli hai director Terhan". The Tribune. Retrieved 30 September 2020.[permanent dead link]