రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశానికి చెందిన ఒక బహుళజాతీయ సంఘటిత సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ముఖేష్ అంబానీ దీనికి సారథ్యం వహిస్తున్నాడు. రిలయన్స్ కు దేశవ్యాప్తంగా ఎనర్జీ, పెట్రో రసాయననాలు, వస్త్రాలు, సహజ వనరులు, రీటెయిల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేసే అనేక సంస్థలు ఉన్నాయి. ఇది భారతదేశంలో అత్యంత లాభదాయకమైన కంపెనీ.[3] మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం బహిరంగ మార్కెట్లో ట్రేడ్ చేయబడుతున్న అతి పెద్ద కంపెనీ.[4] ఇటీవలే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను అధిగమించి అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే సంస్థగా నిలిచింది.[5] 2020 సెప్టెంబరు 10 నాటికి 200 బిలియన్ డాలర్లు మార్కెట్ విలువ దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.[6]

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
రకం
పబ్లిక్
వర్తకం చేయబడింది
ISININE002A01018
పరిశ్రమసంఘటిత సంస్థ
స్థాపించబడింది8 May 1973; 50 సంవత్సరాల క్రితం (8 May 1973)
స్థాపకుడుధీరుభాయ్ అంబానీ
ప్రధాన కార్యాలయం
ముంబై, మహారాష్ట్ర
,
పనిచేసే ప్రాంతాలు
ప్రపంచవ్యాప్తం
ప్రధాన వ్యక్తులు
ముకేష్ అంబానీ
(ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్)
ఉత్పత్తులు
 • పెట్రోలియం
 • సహజ వాయువు
 • పెట్రో రసాయనాలు
 • వస్త్రాలు
 • రీటైల్
 • టెలీకమ్యూనికేషన్స్
 • మీడియా
 • టెలివిజన్
 • వినోదం
 • మ్యూజిక్
 • బ్యాంకింగ్
 • సాఫ్ట్వేర్
ఆదాయంIncrease ₹6,59,205 crore (US$92 billion)[1] (2020)
Increase 1,02,280 crore (US$13 billion) [1] (2020)
Increase 44,324 crore (US$5.6 billion) [1] (2020)
మొత్తం ఆస్థులుIncrease 11,65,915 crore (US$150 billion)[1] (2020)
మొత్తం ఈక్విటీIncrease 4,46,992 crore (US$56 billion) [1] (2020)
యజమానిముకేష్ అంబానీ (50.49%)[2]
ఉద్యోగుల సంఖ్య
195,618 (2020)[1]
ఉపసంస్థలు
 • జియో ప్లాట్ ఫార్మ్స్ (67.03%)
 • ఫ్యూచర్ గ్రూప్
 • జియో పేమెంట్స్ బ్యాంక్ (70%)
 • రిలయన్స్ రీటైల్
 • రిలయన్స్ పెట్రోలియం
 • నెట్వర్క్ 18 గ్రూప్ (64%)
 • ఫుట్ బాల్ స్పోర్ట్స్ డెవెలప్మెంట్ లిమిటెడ్
 • ముంబై ఇండియన్స్
 • అలోక్ ఇండస్ట్రీస్
జాలస్థలిwww.ril.com Edit this on Wikidata

2020 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో కంపెనీ 96 వ స్థానంలో ఉంది.[7] ఇది 2016 నాటికి టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలలో 8 వ స్థానంలో ఉంది. రిలయన్స్ భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతోంది. భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతుల్లో 8% అంటే 1,47,755 కోట్ల రూపాయల విలువ గలిగినది. 108 దేశాలలో మార్కెట్లలో అందుబాటులో ఉంది.[8] కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా భారతదేశ మొత్తం ఆదాయంలో దాదాపు 5% రిలయన్స్ ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వస్తుంది. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారు.[8][9]

మూలాలు సవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "RIL Annual Report 2020". RIL. Archived from the original on 24 April 2019. Retrieved 19 April 2020.
 2. "Reliance Industries Ltd. Share holding pattern". NDTV Profit. Archived from the original on 11 April 2017. Retrieved 8 November 2016.
 3. "Top companies in India by Net Profit". Moneycontrol.com. Archived from the original on 19 July 2017. Retrieved 20 July 2017.
 4. "Top '100' companies by market capitalisation as on July 19, 2017". Bseindia.com. Archived from the original on 15 July 2017. Retrieved 20 July 2017.
 5. "RIL becomes India's biggest company in revenue terms". The Economic Times. 21 May 2019. Retrieved 21 May 2019.
 6. "RIL becomes first Indian company to cross $200 billion in market valuation". Retrieved 10 September 2020.
 7. "Fortune Global 500 list". Archived from the original on 7 August 2019. Retrieved 18 October 2019.
 8. 8.0 8.1 "Reliance Industries AGM full text". 21 July 2017. Archived from the original on 6 August 2017. Retrieved 21 July 2017.
 9. "Reliance Industries Consolidated Balance Sheet, Reliance Industries Financial Statement & Accounts". moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 30 June 2020.